Breaking News

రేటు కార్డా? సేఫ్‌గార్డా? 

Published on Wed, 06/14/2023 - 05:01

న్యూఢిల్లీ: ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రతిపక్షాలపై మరోసారి విరుచుకుపడ్డారు. కొన్ని రాష్ట్రాల్లో వారసత్వ పార్టీలు ఉద్యోగాల పేరిట ‘రేటు కార్డ్‌ల’తో యువతను దోచుకుంటున్నాయని దుయ్యబట్టారు. తమ ప్రభుత్వం యువత ప్రయోజనాల పరిరక్షణ కోసం(సేఫ్‌గార్డ్‌) పని చేస్తోందని ఉద్ఘాటించారు. వారసత్వ పార్టీలా? లేక మంచి చేసే ప్రభుత్వమా? యువత భవిష్యత్తు ఎవరిపై ఆధారపడాలన్నది దేశమే తేల్చుకుంటుందని స్పష్టం చేశారు. ప్రధాని మోదీ మంగళవారం రోజ్‌గార్‌ మేళాలో పాల్గొన్నారు.

వివిధ ప్రభుత్వ విభాగాల్లో ఉద్యోగాలు పొందిన 70,000 మందికిపైగా యువతీ యువకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన ప్రసంగిస్తూ.. ఇప్పటి విపక్షాలు గతంలో అధికారంలో ఉన్నప్పుడు విచ్చలవిడిగా అవినీతికి పాల్పడ్డాయని పరోక్షంగా కాంగ్రెస్‌పై ధ్వజమెత్తారు. పథకాల పేరిట ప్రజాధనం దోచుకున్నాయని ఆరోపించారు. ఉద్యోగాల నియామకాల్లోనూ అవినీతి, అవకతవకలు జరిగాయన్నారు.

రిక్రూట్‌మెంట్‌ ప్రక్రియలో అవినీతి, ఆశ్రిత పక్షపాతాన్ని ప్రోత్సహించడం ద్వారా వారసత్వ పార్టీలు యువతను దగా చేస్తున్నాయని ఆక్షేపించారు. తమ ప్రభుత్వం వచ్చాక పూర్తి పారదర్శకంగా, అవినీతికి తావులేకుండా నియామకాలు చేపడుతున్నామని తెలిపారు. యువతకు ఉద్యోగాలు కల్పించడంతోపాటు ప్రజా సాధికారతే లక్ష్యంగా కృషి చేస్తున్నామని వెల్లడించారు. గతంలో నియామక ప్రక్రియ పూర్తి కావడానికి ఏడాదికిపైగా సమయం పట్టేదని, ఇప్పుడు నెలల వ్యవధిలోనే పారదర్శకంగా పూర్తి చేస్తున్నామని గుర్తుచేశారు.  
 
నిర్ణయాత్మకత.. మన గుర్తింపు  
సమాజంలో విభజన తెచ్చేందుకు, ప్రజల మధ్య చిచ్చు పెట్టేందుకు కొన్ని పార్టీలు భాషను ఒక ఆయుధంగా వాడుకుంటున్నాయని ప్రధాని మోదీ విమర్శించారు. ప్రధానంగా దక్షిణాది రాష్ట్రాల్లో ఇలాంటి పెడపోకడలు కనిపిస్తున్నాయని చెప్పారు.   కొన్ని రాజకీయ పార్టీలు బీజేపీని, హిందీ భాషను బూచిగా చూపిస్తూ పబ్బం గడుపుకొనేందుకు ప్రయత్నిస్తున్నాయని మండిపడ్డారు.

ప శ్చిమ బెంగాల్‌లో ప్రభుత్వ ఉద్యోగాలకు రేటు కార్డులు, కట్‌ మనీ వంటివి కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ రేటు కార్డులు యువత కలలను, సామర్థ్యాలను ఛిద్రం చేస్తున్నాయని చెప్పారు. ఉద్యోగాలు ఇప్పించినందుకు బదులుగా పేద రైతుల నుంచి భూములు తీసుకున్నందుకు ఆర్జేడీ నేత లాలూ ప్రసాద్‌ యాదవ్‌ క్రిమినల్‌ కేసులు ఎదుర్కొంటున్నారని గుర్తుచేశారు.    

ఆర్థిక వ్యవస్థకు కొత్త ధీమా  
దేశంలో ప్రభుత్వ, ప్రైవేట్‌ రంగంలో నూతన ఉద్యోగ, ఉపాధి అవకాశాలు విస్తృతంగా అందుబాటులోకి వస్తున్నాయని ప్రధాని మోదీ వెల్లడించారు. ముద్రా యోజన, స్టార్టప్‌ ఇండియా, స్టాండప్‌ ఇండియా వంటి కార్యక్రమాలతో స్వయం ఉపాధి అవకాశాలు భారీగా పెరుగుతున్నాయని చెప్పారు. ఆర్థికంగా వేగంగా ముందుకు సాగుతున్నామని, మన దేశ ఆర్థిక వ్యవస్థకు గతంలో ఇలాంటి విశ్వాసం, ధీమా ఎన్నడూ లభించలేదన్నారు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)