ఐదు నెలల చిన్నారి ఉసురు తీసిన ‘పాలు’

Published on Fri, 01/02/2026 - 12:51

పదేళ్ల కలల పంట..ముద్దులొలికే కొడుకుని చూసుకొని దేవుడిచ్చిన వరం అనుకొని మురిసిపోయారు. కానీ వారికి ఆ ఆనందం ఎంతోకాలం నిలువ లేదు. మధ్యప్రదేశ్‌లో మృత్యుఘంటికలు మోగిస్తున్న నీటి కాలుష్యభూతం వారి ఐదు నెలల చిన్నారిని బలితీసుకుంది. దీంతో తీరని విషాదం. గుండె పగిలేంత బాధ. కన్నీళ్ల సునామీ తప్ప నోరు పెగలని నిశ్శబ్దం. దేశంలోని పలునగరాల్లో ప్రాణాలకు  ముప్పుగా పరిణమిస్తున్న గాలి, నీరు, వాయు కాలుష్య భూతానికి ఇండోర్‌ (Indore)  మరో మచ్చుతునక. 

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లోని భగీరత్‌పురలో  చోటు చేసుకున్న విషాదమిది.  పాలల్లో కలిసిని కలుషిత మైన నీరు  ఐదు నెలల చిన్నారి  అవ్యాన్ సాహు ఉసురు తీసింది. బాధితుడి తండ్రి సునీల్ సాహు ఒక ప్రైవేట్ కొరియర్ కంపెనీలో పనిచేస్తున్నారు. వీరికి పదేళ్లక్రితం కింజల్‌ అనే పాపుట్టింది. చాలా ఏళ్ల ఎదురు చూపుల తరువాత గత ఏడాది  జూలై 8న అవ్యాన్ జన్మించాడు. చక్కటి ఆరోగ్యంగా ముద్దుల మూటగడుతున్న చిన్నారిని చూసి అమ్మమ్మ ఎంతో మురిసిపోయింది. అయితే అవ్యాన్‌ పుట్టిన తరువాత  కొన్ని జెనెటిక్‌ కారణాల రీత్యా తల్లికి పాలుపడలేదు. వైద్యుల సలహామేరకు పోతపాలు పట్టిస్తున్నారు. రోజూలాగానే బిడ్డకు పాలు కలిపి తాగించారు. కుళాయి నీరు వడకట్టి, పటికను జోడించడం లాంటి కనీస జాగ్రత్తలు తీసుకున్నారు. అయినా కాలుష్యం అవ్యాన్‌ను కాటేసింది. 

జ్వరం, విరేచనాల ( Diarrhoea) తో బాధపడుతున్న పిల్లాడిని డాక్టర్ దగ్గరికి తీసుకెళ్లి మందులు ఇచ్చారు. అయినా ఫలితం దక్కలేదు. పరిస్థితి మరింత  దిగజారి  సోమవారం ఉదయం,ఆసుపత్రికి తీసుకెళ్లే మార్గంలోనే అవ్యాన్‌ కన్నుమూశాడు.  దీంతో ఆ కుటుంబంలో ఒక్కసారి తీరిని విషాదం అలుముకుంది. బిడ్డను కోల్పోయిన తల్లి కంటికి మింటికి ధారగా విలపిస్తోంది. తీరని దుఃఖంతో స్పృహ కోల్పోతూ, మెలకువ రాగానే మళ్లీ శోకంతో కుంగిపోతోంది. నీరు కలుషితమైంది తమకెవరూ చెప్పలేదని కన్నీళ్లు పెట్టుకోవడం తప్ప ఏమీ చేయలేని నిస్సహాయత తండ్రి సునీల్‌ది. తాము నమ్మిన నీరే బిడ్డ ప్రాణం తీసిందని వాపోతున్నాడు.

మేం పేదోళ్లం సార్‌.. మేం ఎవర్నీ నిందించలేం.ఇది మా తలరాత అంటూ రోదిస్తోంది అమ్మమ్మ. తమ కుటుంబనాకి పెద్ద నష్టమే కానీ ఏం జరిగిందో అర్థం కాక పదేళ్ల కింజల్ నిశ్శబ్దంగా దీనంగా  చూస్తోంది.

కాగా దేశంలోనే అత్యంత పరిశుభ్రమైన నగరంగా వరుసగా ఏడేళ్లు  గుర్తింపు పొందిన ఇండోర్‌లోని భాగీరథ్‌పురాలో, నర్మదా నది పైప్‌లైన్‌లో డ్రైనేజీ నీరు కలిసి, తాగునీరు కలుషితమైంది. దీంతో చాలామంది చనిపోయారు. గత పది రోజులుగా పలువురు బాధితులు వివిధ ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతన్నారు. మరోవైపు ఈవిషయంపై దర్యాప్తు నిమిత్తం మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఒక కమిటీని ఏర్పాటు చేసింది.
 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)