Breaking News

వయనాడ్‌లో కొత్త ట్విస్ట్‌.. వారికి బాధితుల ఇండ్లే టార్గెట్‌

Published on Sun, 08/04/2024 - 10:52

తిరువనంతపురం: కేరళలోని వయనాడ్‌లో ప్రకృతి విపత్తు కారణంగా వందల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కోల్పోయారు. కాగా, కొండచరియలు విరిగిపడిన ఘటనలో మృతుల సంఖ్యలో 357కు చేరింది. మరో 200 మంది బాధితులు కనిపించడం లేదు. మరోవైపు.. వయనాడ్‌ ప్రాంతంలో దొంగలు రెచ్చిపోతున్నారు. బాధితుల వదిలేసిన ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్నారు.

వివరాల ప్రకారం.. వయనాడ్‌ ప్రాంతంలో బాధితులు కొంత మంది తమ ఇళ్లను వదిలేసి సురక్షిత ప్రాంతాలకు తరలివెళ్లారు. వారి ఇళ్లలో సామాగ్రి, కొన్ని విలువైన వస్తువులు అక్కడే ఉండిపోయాయి. ఈ క్రమంలో వారి నివాసాలను దొంగలు టార్గెట్‌ చేశారు. రాత్రి సమయంలో దొంగలు అక్కడికి చేరుకుని వారి నివాసాల్లో చోరీలకు పాల్పడుతున్నారు. కాగా, తాజాగా కొందరు బాధితులు వారి ఇళ్లకు వెళ్లి చూడగా సామాగ్రి లేకపోవడాన్ని గుర్తించారు. దీంతో,  రాత్రి వేళల్లో దొంగతనాలకు పాల్పడే వారిని గుర్తించి శిక్షించాలని బాధిత ప్రజలు అధికారులను కోరారు.

 

 

ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ..‘కొండచరియలు విరిగిపడిన దుర్ఘటన సమయంలో మా భద్రత కోసం మేము మా ఇళ్లను విడిచిపెట్టాము. కానీ ఆ తర్వాత మా ఇంటికి వచ్చి పరిస్థితులు ఎలా ఉన్నాయో చూసేందుకు ఇక్కడికి వచ్చాం. మేము తిరిగి వచ్చినప్పుడు, తలుపులు పగలగొట్టి తెరిచి ఉండడాన్ని చూసి ఆందోళనకు గురయ్యాం. మా ఇళ్లలోని సామాగ్రిని ఎత్తుకెళ్లారు. విలువైన వస్తువులను కూడా దొంగతనం చేశారు. అంతేకాకుండా ప్రస్తుతం మేము ఉంటున్న రిసార్టులోకి గదిని కూడా దొంగలు టార్గెట్‌ చేశారు. మా దుస్తులను, డబ్బులను దోచుకుంటున్నారు అని ఆవేదన వ్యక్తం చేశారు.

ఇక, బాధితుల ఫిర్యాదుతో చూరల్మల, ముండక్కై సహా విపత్తు ప్రభావిత ప్రాంతాల్లో పోలీసులు గస్తీ చేపట్టారు. పోలీసుల అనుమతి లేకుండా రాత్రి వేళల్లో విపత్తు ప్రాంతాల్లోకి లేదా బాధితుల ఇళ్లలోకి ప్రవేశించే వారిపై చర్యలు తీసుకుంటామని పోలీసులు అధికారులు ఓ ప్రకటనలో తెలిపారు. రాత్రి వేళల్లో పోలీసుల అనుమతి లేకుండా రెస్క్యూ ఆపరేషన్ల పేరుతో గానీ, మరేదైనా ప్రభావిత ప్రాంతాల్లోకి లేదా ఇళ్లలోకి ప్రవేశించడానికి ఎవరినీ అనుమతించరు అని పోలీసు శాఖ పేర్కొంది. 

Videos

గడువు పెరుగుతుందా..? నామినేషన్లపై సుప్రీం ఏం చెప్పనుంది..?

టీడీపీ దౌర్జన్యకాండ.. YSRCP అభ్యర్థుల నామినేషన్లు అడ్డుకోవాలని పిలుపు..

నా ఫ్యామిలీని కాపాడండి.. YSRCP అభ్యర్థి షేక్ ఇమామ్ విజ్ఞప్తి

నీకు దమ్ముంటే.. రా, లోకేశ్‌కు వైసీపీ దాసరి అరుణ బహిరంగ సవాల్!

సారా అర్జున్ సినిమాలు ఎందుకు తగ్గించింది? అసలు కారణం ఇదేనా?

లోకేశ్ బంపర్ ఆఫర్.. రౌడీయిజం చేస్తేనే మంత్రి పదవి లేకపోతే మీ పవర్ కట్..

ఇంట్లో ఉన్న YSRCP MPTC అభ్యర్థిని లాక్కెళ్లిన SI విజయ్

టీడీపీ గూండాలకు పోలీసులు కొమ్ముకాశారు... ఎవరినీ వదిలిపెట్టం

ధర పెరిగిందని పాత బంగారం అమ్మితే లాభమా? నష్టమా? అసలు లెక్క ఇదే

నేనేంటో చూపిస్తా.. బాబుకు దీప్తి రెడ్డి మాస్ వార్నింగ్

Photos

+5

నాకు హైదరాబాద్ ఎంతిష్టమో మీకు తెలుసు.. రకుల్ ప్రీత్ లేటెస్ట్ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌లో సందడిగా 'రామాయణ' ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)