Breaking News

పట్నాకు గంగ ముప్పు.. పాఠశాలలు మూసివేత

Published on Tue, 09/24/2024 - 07:25

పట్నా: బీహార్‌లోని పట్నా జిల్లాలోని పలు ప్రాంతాల్లో గంగా నది నీటిమట్టం ప్రమాదకర స్థాయికి చేరుకుంది. ఈ నేపధ్యంలో ముందు జాగ్రత్త చర్యగా 76 ప్రభుత్వ పాఠశాలలను తాత్కాలికంగా మూసివేయాలని జిల్లా యంత్రాంగం నిర్ణయించింది.

ఈ పాఠశాలలు సెప్టెంబర్ 26 వరకు మూసివేయనున్నారు. పట్నా జిల్లా మేజిస్ట్రేట్ చంద్రశేఖర్ సింగ్ ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేశారు. గంగా నది చాలా చోట్ల ప్రమాదకర స్థాయికి మించి ప్రవహిస్తున్నందున ముందుజాగ్రత్త చర్యగా జిల్లాలోని పలు గ్రామీణ ప్రాంతాల్లోని పలు పాఠశాలలను మూసివేయాలని నిర్ణయం తీసుకున్నట్లు దానిలో పేర్కొన్నారు.

జిల్లా యంత్రాంగం విడుదల చేసిన ఒక ప్రకటనలోని వివరాల ప్రకారం సోమవారం ఉదయం 6 గంటల సమయానికి పట్నాలోని గాంధీ ఘాట్ వద్ద గంగా నది ప్రమాదకర స్థాయి (48.60 మీటర్లు) దాటి ప్రవహిస్తోంది. అలాగే హతిదా, దిఘా ఘాట్‌ల వద్ద గంగా నది ఉధృతంగా ప్రవహిస్తోంది. ఈ నేపధ్యంలో డిఎండి అదనపు ప్రధాన కార్యదర్శి (ఎసీఎస్) ప్రత్యయ అమృత్ 12 జిల్లాల అధికారులతో ఆన్‌లైన్‌లో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. గంగానది నీటిమట్టం పెరిగితే అప్రమత్తంగా ఉండాలని అధికారులను ఆదేశించారు.

గంగా నది ఒడ్డున ఉన్న దాదాపు 12 జిల్లాల్లో వరదలు వచ్చే అవకాశం ఉందని, లోతట్టు ప్రాంతాలలో నివసిస్తున్న దాదాపు 13.56 లక్షల మంది అప్రమత్తంగా ఉండాలని అధికారులు కోరారు. అలాగే బక్సర్, భోజ్‌పూర్, సరన్, వైశాలి, పట్నా, సమస్తిపూర్, బెగుసరాయ్, ముంగేర్, ఖగారియా, భాగల్‌పూర్, కతిహార్ తదితర 12 జిల్లాలకు చెందిన ప్రజలను ప్రత్యేక సహాయ శిబిరాలకు తరలించారు.

ఇది కూడా చదవండి: వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి..
 

#

Tags : 1

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)