Breaking News

ఉత్తరకాశీలో భయపెడుతున్న మరో సొరంగం

Published on Sat, 12/02/2023 - 07:41

ఉత్తరకాశీ జిల్లాలోని మరో సొరంగం స్థానికులను భయానికి గురిచేస్తోంది. ఈ సొరంగం నుంచి భారీగా నీరు ఉబికివస్తుండంతో ఇక్కడి సాగునీటి కాలువ, పంట భూములు దెబ్బతిన్నాయి. మరోవైపు ఇటీవలే కుప్పకూలిన టన్నెల్‌ మరమ్మతు పనులు కొనసాగుతున్నాయని ఉత్తరాఖండ్‌ జల విద్యుత్‌ నిగమ్‌ లిమిటెడ్‌ (యూజేవీఎన్‌ఎల్‌) తెలిపింది. 

ఉత్తరకాశీలోని మనేరి భళి-2 ప్రాజెక్ట్‌లో 16 కిలోమీటర్ల పొడవైన సొరంగం ఉంది. ఈ సొరంగం గుండా నీరు ప్రవహిస్తోంది. ధారసులో విద్యుత్తు ఉత్పత్తి అవుతుంటుంది. ధారసు బ్యాండ్ సమీపంలోని మహర్‌గావ్‌లోని సొరంగం నుండి నీటి లీకేజీ రెండేళ్ల క్రితమే ప్రారంభమైంది. ఇది క్రమంగా పెరుగుతోంది. యూజేవీఎన్‌ఎల్‌ ఇప్పటికే దీని మరమ్మతుల కోసం కోట్లాది రూపాయలు ఖర్చు చేసింది. అయినా లీకేజీ అదుపులోకి రావడం లేదు. 

గత రెండేళ్ల నుంచి ఇక్కడ నీటి లీకేజీ వేగంగా పెరుగుతోందని గ్రామ పెద్ద సురేంద్రపాల్ చెప్పారు.  ఫలితంగా సాగునీటి కాలువ, పలు పంట భూములు దెబ్బతిన్నాయని, పలు చోట్ల భూమి కోతకు గురవుతోందని అన్నారు. ఈ సొరంగానికి తక్షణమే మరమ్మతులు చేయాలని ఆయన కోరారు. కాగా మనేరి భళి సొరంగం నీటి లీకేజీ నివారణకు మరమ్మతులు  చేస్తున్నామని, త్వరలోనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని యూజేవీఎన్‌ఎల్‌ ఎండీ సందీప్ సింఘాల్ తెలిపారు. 
ఇది కూడా చదవండి: ఇటలీ ప్రధానితో భారత ప్రధాని దోస్తీ చేస్తే..

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)