వక్ఫ్‌ సవరణ బిల్లుకు జేపీసీ ఆమోదం

Published on Mon, 01/27/2025 - 15:54

సాక్షి, ఢిల్లీ: వక్ఫ్‌ సవరణ బిల్లు విషయంలో కీలక పరిణామం చోటుచేసుకుంది. వక్ఫ్‌ సవరణ బిల్లు పరిశీలన కోసం ఏర్పాటు చేసిన పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) పలు ప్రతిపాదనలతో బిల్లుకు ఆమోదం తెలిపింది. ఇక, జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం. ఈ నేపథ్యంలో రానున్న బడ్జెట్‌ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లును ఆమోదించే అవకాశం ఉంది. 

వక్ఫ్‌ సవరణ బిల్లుకు పార్లమెంటరీ సంయుక్త కమిటీ (JPC) పలు ప్రతిపాదనలతో ఆమోదం తెలిపింది. విపక్ష ఎంపీలు సహా ఇతరులు మొత్తంగా 44 మార్పులు సూచించగా.. 14 సవరణలను కమిటీ ఆమోదించినట్లు ప్యానెల్‌ ఛైర్మన్‌ జగదాంబిక పాల్‌ వెల్లడించారు. ఈ సవరణలు చట్టాన్ని మరింత శక్తివంతంగా మారుస్తాయన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

బడ్జెట్ సమావేశాల్లో వక్ఫ్‌ సవరణ బిల్లు ఆమోదించే అవకాశం

అయితే, కమిటీలో ఎన్డీయే సభ్యులు సూచించిన మార్పులకు ఆమోదం లభించింది. ఇదే సమయంలో విపక్ష సభ్యులు సూచించిన మార్పులకు మాత్రం ఆమోదం లభించకపోవడం గమనార్హం. వారి సూచనలు  తిరస్కరణకు గురయ్యాయి. ఈ నేపథ్యంలో బిల్లు విషయమై ప్రతిపక్ష ఎంపీలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ప్రజాస్వామ్య పద్ధతిలో కమిటీ పనిచేయలేదని విపక్ష సభ్యులు ఆరోపించారు. మొత్తంగా జేపీసీ సూచించిన 14 ప్రతిపాదనల ఆమోదానికి సంబంధించి జనవరి 29న ఓటింగ్‌ జరగనుంది. జనవరి 31న తుది నివేదిక లోక్‌సభకు అందజేయనున్నట్లు సంబంధిత వర్గాల సమాచారం.

ఈ సందర్బంగా జేపీసీ చైర్మన్‌ జగదాంబికా పాల్‌ మీడియాతో మాట్లాడుతూ.. బిల్లు ఆమోదంలో భాగంగా 44 సవరణలు చర్చించబడ్డాయి. ఆరు నెలల కాలంలో వివరణాత్మక చర్చల తర్వాత, మేము అందరు సభ్యుల నుండి సవరణలను కోరాము. ఇది మా చివరి సమావేశం.. కాబట్టి, మెజారిటీ ఆధారంగా 14 సవరణలను కమిటీ ఆమోదించింది. ప్రతిపక్షం కూడా సవరణలను సూచించింది. మేము ఆ సవరణలలో ప్రతిదాన్ని ప్రతిపాదించాము. వాటిపై ఓటింగ్‌ జరుగుతుంది. కానీ వారి (సూచించిన సవరణలు) మద్దతుగా 10 ఓట్లు.. వ్యతిరేకంగా 16 ఓట్లు వచ్చాయి’ అని తెలిపారు. 

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)