Breaking News

వక్ఫ్‌ బోర్డులను నియంత్రించే ఉద్దేశం లేదు: నడ్డా 

Published on Mon, 04/07/2025 - 05:13

న్యూఢిల్లీ: వక్ఫ్‌ బోర్డులను నియంత్రించాలన్న ఉద్దేశం ప్రభుత్వానికి లేదని బీజేపీ జాతీయ అధ్యక్షుడు, కేంద్ర మంత్రి జె.పి.నడ్డా స్పష్టంచేశారు. వక్ఫ్‌ బోర్డులు చట్ట పరిధిలోనే పని చేయాల్సి ఉంటుందని పేర్కొన్నారు. ఆయా బోర్డుల ఆస్తులు విద్య, వైద్యం, ఉపాధి కల్పన కోసం ఉపయోగపడాలని, తద్వారా ముస్లిం వర్గానికి మేలు జరగాలని చెప్పారు. బీజేపీ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఆదివారం పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో జె.పి.నడ్డా పాల్గొన్నారు.

 పార్టీ జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. టర్కీతోపాటు చాలా దేశాల్లో వక్ఫ్‌ బోర్డుల ఆస్తులను అక్కడి ప్రభుత్వాలు నియంత్రణలోకి తీసుకున్నాయని గుర్తుచేశారు. మన దేశంలో మాత్రం బోర్డులు చట్ట పరిధిలో పని చేయాలని చెబుతున్నామని పేర్కొన్నారు. ఎవరైనా సరే నిబంధనల ప్రకారమే నడుచుకోవాల్సి ఉంటుందన్నారు. అలాగే బీజేపీ ప్రస్థానాన్ని నడ్డా ప్రస్తావించారు. నేడు బీజేపీ ప్రపంచంలోనే అతిపెద్ద పార్టీల్లో ఒకటిగా మారిందని అన్నారు. ప్రస్తుతం బీజేపీకి 240 మంది లోక్‌సభ సభ్యులు, 98 మంది రాజ్యసభ సభ్యులు, 1,600 మందికిపైగా ఎమ్మెల్యేలు ఉన్నారని గుర్తుచేశారు.

Videos

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)