Breaking News

చెత్తలో వీవీపాట్‌ స్లిప్‌లు.. ఎన్నికల అధికారి సస్పెండ్

Published on Fri, 11/14/2025 - 07:36

సమస్తీపూర్: బీహార్‌ అసెంబ్లీ ఎన్నికల ఓట్ల లెక్కింపునకు సన్నాహాలు జరుగుతున్న సమయంలో సమస్తీపూర్ జిల్లాలో రోడ్డు పక్కన పెద్ద సంఖ్యలో వీవీపాట్‌ స్లిప్‌లు లభమయ్యాయి. ఈ నేపధ్యంలో ఒక అసిస్టెంట్ రిటర్నింగ్ అధికారిని సస్పెండ్ చేసి, అతనిపై కేసు నమోదు చేసినట్లు  ఎన్నికల సంఘం ఒక ప్రకటనలో తెలిపింది.

జిల్లాలోని సరైరంజన్ అసెంబ్లీ సెగ్మెంట్‌లోని ఒక కళాశాల సమీపంలో రోడ్డు పక్కన చెల్లాచెదురుగా వీవీపాట్‌ స్లిప్‌లు కనిపించాయి. సోషల్ మీడియాలో దీనికి సంబంధించిన వీడియో వైరల్ కావడంతో ఎన్నికల సంఘం వెంటనే చర్యలు చేపట్టింది. ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం విడుదల చేసిన ఒక ప్రకటనలో జిల్లా మేజిస్ట్రేట్ సంఘటనా స్థలాన్ని సందర్శించి, ఈ  ఉదంతంపై విచారణ జరపాలని ఆదేశించింది. స్థానికంగా పోటీలో  ఉన్న అభ్యర్థులకు కూడా ఈ విషయమై డీఎంకు సమాచారం అందించారు. దీనికి ఆయన సమాధానమిస్తూ నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఏఆర్‌ఓను సస్పెండ్ చేశారని, అతనిపై ఎఫ్‌ఐఆర్‌ నమోదు చేశారని, కేసు దర్యాప్తు చేస్తున్నారని తెలిపారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)