Breaking News

ముగ్గురు రాముళ్లు... ఒకరికి ప్రాణ ప్రతిష్ట... ఎంపిక నేడు!

Published on Fri, 12/29/2023 - 12:39

లక్నో: అయోధ్య రామ మందిరంలో ప్రతిష్టించే రాముని విగ్రహాన్ని నేడు ఎంపిక చేయనున్నారు. విగ్రహాన్ని ఎంపిక చేయడానికి శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర సమావేశంలో నేడు ఓటింగ్ జరుగుతుంది. ప్రత్యేక శిల్పులు రూపొందించిన మూడు నమూనాల్లో ఒక విగ్రహాన్ని ఎంపిక చేయనున్నారు. ఎక్కువ ఓట్లు పొందిన అత్యుత్తమ విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్టించనున్నారు. 

నేడు జరగనున్న ఓటింగ్‌లో బాలరాముని మూడు విగ్రహాలను సమర్పిస్తారు. ఇందుకు 51 అంగుళాలు ఉన్న ఐదేళ్ల రాముని విగ్రహాలను శిల్పులు రూపొందించినట్లు ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్ తెలిపారు. బాల రాముని దైవత్వం కళ్లకు కట్టినట్లు కనిపించే విగ్రహాన్ని ఎంపిక చేస్తామని ఆయన అన్నారు. 

జనవరి 22న జరగనున్న పట్టాభిషేక మహోత్సవానికి తేదీ సమీపిస్తున్న తరుణంలో రామజన్మభూమి మార్గం, ఆలయ సముదాయంలో జరుగుతున్న నిర్మాణ పనులను శ్రీరామ మందిర నిర్మాణ కమిటీ చైర్మన్ నృపేంద్ర మిశ్రా పరిశీలించారు. నిర్మాణం వేగంగా పూర్తి చేయడానికి కంటే కూడా నాణ్యతపైనే దృష్టి పెట్టామని మిశ్రా తెలిపారు. 

ఏడు రోజుల పాటు జరిగే పవిత్రోత్సవం జనవరి 16న ప్రాయశ్చిత్త కార్యక్రమంతో ప్రారంభమవుతుంది. ఈ వేడుకలో బాలరాముని విగ్రహం ఊరేగింపు ఉంటుంది. ఆచార స్నానాలు, పూజలు, అగ్ని ఆచారాలు వరుసగా ఉంటాయి. జనవరి 22న, ఉదయం పూజ తరువాత మధ్యాహ్నం పవిత్రమైన మృగశిర నక్షత్రాన బాల రాముడు మందిరంలో కొలువు దీరనున్నాడు.

ఇదీ చదవండి: సీఐఎస్ఎఫ్ తొలి మహిళా డైరెక్టర్ జనరల్‌గా నీనా సింగ్‌

Videos

మెగా DSC స్కామ్ లో చేతులు మారిన కోట్ల రూపాయలు..!

రఘు మాస్టర్ పై కేసు పెట్టిన సుమలత

DSC స్కామ్ పై బాబును నిలదీసిన YS జగన్

లక్షకు 30 లక్షల లాభం.. కాసుల వర్షం కురిపించిన స్టాక్స్

జైల్లో మిమ్మల్ని మేము పెట్టలేమా..? రిటైర్మెంట్ టైమ్ లో రాజకీయాల్లోకి వచ్చారు...

కొండా అవుట్... మంత్రి పదవి కావలెను

ఇంకెంతకాలం ఈ సోది చెప్పుకొని బతుకుతారు..! ఏకిపారేసిన జడ శ్రవణ్..!

జనసేన ఇన్ ఛార్జ్ యుగంధర్ పైసా వసూల్

ఢిల్లీలో భారీ వర్షం.. పట్టపగలే చీకట్లు

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

Photos

+5

శ్రీకృష్ణాష్టమి వేడుకలు.. రాధా వేషధారణలో అనసూయ(ఫోటోలు)

+5

హాయ్ మూవీ మూడ్‌లో నయనతార పోజులు.. ఫోటోలు

+5

బ్యూటీఫుల్ శారీలో హీరోయిన్ ప్రియమణి అందాలు.. ఫోటోలు

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)