Breaking News

వైష్ణోదేవి దర్శనానికి వందేభారత్‌... ఖర్చెంత?

Published on Tue, 06/25/2024 - 12:10

వైష్ణో దేవి భక్తులకు ఐఆర్‌సీటీసీ శుభవార్త చెప్పింది. ఇకపై అమ్మవారి దర్శనాన్ని వందేభారత్‌ రైలు ద్వారా చేసుకోవచ్చని తెలిపింది. ఇది లగ్జరీ రైలు  కావడంతో ప్రయాణికులకు పలు సౌకర్యాలు అందనున్నాయి. దీనిలో ప్రయాణించడం ద్వారా సమయాన్ని ఆదా చేసుకోవడమే కాకుండా, ప్రయాణాన్ని ఆహ్లాదకరంగా మార్చుకోవచ్చు.

వందేభారత్‌ ఎక్స్‌ప్రెస్ రైలు ఢిల్లీ నుండి ఉదయం ఆరు గంటలకు బయలుదేరుతుంది. మధ్యాహ్నం రెండు గంటలకు కట్రాకు చేరుతుంది. అదే ఇతర రైలు అయితే ఉదయం ఢిల్లీ నుంచి బయలుదేరి కట్రాకు సాయంత్రం ఆరు గంటలకు చేరుతుంది. అయితే ఈ మార్గంలో ప్రయాణించే వందే భారత్ ఛార్జీలు మిగిలిన రైళ్ల ఛార్జీల కంటే కొంచెం అధికం.

ఢిల్లీ నుండి మాతా వైష్ణో దేవి కట్రా స్టేషన్‌కు ఇతర రైళ్ల టిక్కెట్‌ రూ. 990 వరకూ ఉంటుంది. అయితే వందే భారత్ చైర్ కార్‌లో రూ. 1610 టిక్కెట్‌తో కట్రాకు చేరుకోవచ్చు. ఎకనామిక్ చైర్ క్లాస్‌లో వెళితే ఒక్కో ప్రయాణికునికి  రూ. 3005 చెల్లించాల్సి ఉంటుంది.  వందే భారత్ రైలులో టిక్కెట్లు బుక్ చేసుకునేందుకు  సమీపంలోని రైల్వే స్టేషన్‌లోని కౌంటర్‌కు వెళ్లి సంప్రదించవచ్చు. లేదా ఆన్‌లైన్, ఆఫ్‌లైన్‌లలోనూ టిక్కెట్లు బుక్ చేసుకోవచ్చు. 

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)