Breaking News

చిమ్మచీకట్లలోనే ఢిల్లీ

Published on Sat, 12/20/2025 - 09:04

ఉత్తర భారతంపై పొగమంచు దుప్పటి కమ్మేసుకుంది. దేశ రాజధాని సహా పంజాబ్, హర్యానా, ఇటు ఉత్తర్‌ప్రదేశ్, ఈశాన్య మధ్యప్రదేశ్‌ సహా బిహార్‌ రాష్ట్రాలపై ప్రభావం చూపెడుతోంది. ఢిల్లీలో శనివారం తెల్లవారు ఝామున 8గం. సమయంలోనూ చిమ్మచీకట్లు నెలకొన్నాయి. అతి సమీపంలోని వాహనాలు సైతం కనిపించని పరిస్థితి కనిపించింది. 

వాయు కాలుష్యానికి పొగమంచు తోడు కావడంతో ఊపిరి సైతం పీల్చుకోలేని స్థితిలో ఢిల్లీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుత పరిస్థితుల దృష్ట్యా రెడ్‌ అలర్ట్‌ నుంచి ఆరెంజ్‌ అలర్ట్‌కు మార్చింది వాతావరణ శాఖ. అయితే ప్రతికూల వాతావరణ పరిస్థితులు రోజంతా నెలకొంటాయని నగర వాసులను హెచ్చరిస్తోంది. మరోవైపు.. యూపీ, పంజాబ్, ఉత్తరాఖండ్‌లలోని పలు జిల్లాలకు ఆరెంజ్‌ అలర్ట్‌ను కంటిన్యూ చేస్తోంది. 

రాజధానిలో ఇవాళ ఉదయం 7గం. సమయంలో ప్రగతి మైదాన్‌ భైవర్‌ మార్గ్‌ వద్ద ఏక్యూఐ 433గా రికార్డు కావడం గమనార్హం.  ఐటీవోలో 439, ఆనంద్‌ విహర్‌లో 423, జహంగీర్‌పూరీలో 420, నెహ్రూ నగర్‌లో 418, వాజిర్‌పూర్‌లో 417, పంజాబీ బాగ్‌లో 423, రోహిణిలో 407గా ఏఐక్యూ నమోదు అయ్యింది. ఢిల్లీలో వాయు నాణ్యత సూచీ మొత్తంగా 380గా ఉండి ‘వెరీ పూర్‌’ కేటగిరీలో కొనసాగుతోంది.

 

పొగమంచు కారణంగా రోడ్డు, రైలు, వాయు మార్గాల్లో రవాణాకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ‍ప్రమాదాలు జరిగే అవకాశం ఉండడంతో.. రహదారుల్లో వాహనదారులు జాగ్రత్తగా ఉండాలని అధికార యంత్రాంగం హెచ్చరికలు జారీ చేసింది.  అలాగే రాజధాని రీజియన్‌ నుంచి 30 రైళ్లు ఆలస్యంగా నడుస్తున్నాయి. మరికొన్నింటిని రీషెడ్యూల్‌ చేసే యోచనలో ఉన్నట్లు అధికారులు తెలిపారు.  

మంచువల్ల ఢిల్లీ విమానాశ్రయంలో పలు విమానాలు రద్దు అయ్యాయి. మరికొన్ని ఆలస్యంగా నడుస్తాయని ఎయిర్‌పోర్ట్‌ అధికారులు తెలిపారు. ప్రయాణికులను అసౌకర్యానికి గురి చేయొద్దని.. విమాన ప్రయాణాల అంతరాయాల విషయంలో తగిన మార్గదర్శకాలు పాటించాలని ఇటు పౌర విమానయాన శాఖ.. అటు డీజీసీఏ ఎయిర్‌లైన్స్‌లకు హెచ్చరికలు జారీ చేశాయి. 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)