Breaking News

‘కృష్ణ’లో బాలరాముని పోలిన శ్రీమహావిష్ణువు!

Published on Wed, 02/07/2024 - 09:36

కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలోని ఒక గ్రామంలో కృష్ణా నదిలో శ్రీమహావిష్ణువు పురాతన విగ్రహం బయల్పడింది. విగ్రహం చుట్టూ దశావతారాలన్నీ నిండుగా కనిపిస్తున్నాయి. అదే సమయంలో ఈ విగ్రహంతో పాటు పురాతన శివలింగం కూడా బయల్పడింది. అయితే నదిలో బయట్పడిన ఈ శ్రీమహావిష్ణువు విగ్రహం ఇటీవల అయోధ్యలోని  నూతన రామాలయంలో ప్రతిష్ఠించిన బాలరాముని విగ్రహాన్ని పోలివుండటం గమనార్హం. 

ఈ శ్రీ మహావిష్ణువు విగ్రహం గురించి రాయచూర్ యూనివర్సిటీ ప్రాచీన చరిత్ర, పురావస్తు అధ్యాపకురాలు డాక్టర్ పద్మజా దేశాయ్ మాట్లాడుతూ కృష్ణానది పరీవాహక ప్రాంతంలో లభించిన ఈ విష్ణుమూర్తి విగ్రహానికి ఎన్నో ప్రత్యేకతలు ఉన్నాయన్నారు. ఈ  విష్ణువు విగ్రహం చుట్టూ  మత్స్య, కూర్మ, వరాహ, నారసింహ, వామన, రాముడు, పరశురాముడు, కృష్ణుడు, బుద్ధుడు, కల్కి తదితర దశావతారాలు అందంగా మలిచారు.

ఈ శ్రీమహా విష్ణువు విగ్రహ విశిష్టతల విషయానికొస్తే విష్ణుమూర్తి నిలువెత్తు భంగిమలో నాలుగు చేతులు కలిగి ఉన్నాడు. అతని పైరెండు చేతులలో శంఖుచక్రాలు ఉండగా, దిగువ చేతులు (‘కటి హస్త’, ‘వరద హస్త’) ఆశీర్వాదాలను అందిస్తున్నట్లు ఉన్నాయి. ఈ విగ్రహం వేంకటేశ్వరుని కూడా పోలి ఉంది. అయితే ఈ విగ్రహంలో గరుడుడు లేడు. సాధారణంగా శ్రీమహా విష్ణువు విగ్రహాలలో గరుడుడు కనిపిస్తాడు. విష్ణువు అలంకార ప్రియుడు కావడంతో ఈ మందహాసధర విష్ణుమూర్తి విగ్రహంపై పూమాలలు కూడా కనిపిస్తాయి. 
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)