Breaking News

హఠాత్తుగా పెళపెళమంటూ రోడ్డు బద్ధలై ఒక్కసారిగా..

Published on Sun, 03/05/2023 - 08:43

ఏమైందో ఏమో ఉన్నటుండి ఒక్కసారిగా రహదారి బద్ధలై నీళ్లు ఫౌంటైన్‌ మాదిరి వెదజిమ్ముతూ బయటకు వచ్చాయి. దీంతో అక్కడ ఉండే వారెవరికీ ఏం జరుగుతుందో అస్సలు అర్థం కాలేదు. ఇదేమైన మరో ప్రకృతి విపత్తా? అన్నట్లుగా జరిగిందా ఆ ఘటన. సరిగ్గా అదే సమయంలో స్కూటీపై పింక్‌ కలర్‌ దుస్తులతో ఒక అమ్మాయి వెళ్తోంది. ఈ హఠాత్పరిణామనికి వెదజిమ్ముతున్న నీటి కారణంగా కిందపడిపోవడమే గాక ఆ నీటి ప్రవాహానికి ఆమె కొట్టుకుపోయింది.

అంత ఘోరంగా నీళ్లు పైకి ఎగదన్నాయి. ఈ ఘటన మహారాష్ట్రలోని యవత్మాల్ జిల్లాలో శనివారం రోడ్డు మధ్యలో చోటు చేసుకుంది. ఐతే చుట్టుపక్కల స్థానికులు ఆమెను రక్షించినట్లు సమాచారం. భూగర్భ పైప్‌ లైన్‌ పగిలిపోవడంతో నీటి ప్రవాహానికి రోడ్డు పెళపెళమంటూ.. విరిగిపోతూ నీళ్లు బయటకు ఉబికివచ్చేశాయి. దీంతో రోడ్డుపై పెద్ద గుంత ఏర్పడి, ఆ రహదారి మొత్తం నీళ్లతో నిండిపోయి, కంకరాళ్లతో చెల్లచెదురుగా కనిపించింది. అందుకు సంబంధించిన వీడియో నెట్టింట తెగ హల్‌చల్‌ చేస్తుంది. 

(చదవండి: తీవ్ర లక్షణాలా? కరోనా కాదు.. యాంటీబయాటిక్స్ అనవసరంగా వాడొద్దు!)

Videos

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

భయంకరమైన మంటల్లో నుంచి శ్రీకాంత్ రెడ్డిని కాపాడిన కార్యకర్తలు

ప్రాణాలతో బయటపడిన తర్వాత శ్రీకాంత్ రెడ్డి ఫస్ట్ రియాక్షన్

మచిలీపట్నం మేయర్ అభ్యర్థి లంకా జ్యోతి ఫస్ట్ రియాక్షన్

మిథున్ రెడ్డి ని కాపాడటానికి గాల్లోకి గన్ మెన్ కాల్పులు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)