Breaking News

వామ్మో, టూటీ ఫ్రూటీ ఇలా తయారుచేస్తారా? వైరల్‌ వీడియో

Published on Fri, 09/04/2026 - 16:43

భారతదేశంలో కేక్‌లు, ఐస్‌క్రీమ్‌లు, బేకరీ ఉత్పత్తులలో విరివిగా ఉపయోగించే 'టూటీ ఫ్రూటీ' (Tutti Frutti) తయారీ విధానానికి సంబంధించిన ఒక వీడియో  తీవ్ర ఆందోళన రేకెత్తిస్తోంది.   దీని తయారీలో పాటిస్తున్న శుభ్రతా ప్రమాణాలు,  కాలుష్య పూరిత వాతావరణం చూసి నెటిజన్లు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.

'పాయల్ కుష్వాహా' అనే నెటిజన్  ఎక్స్‌లో ఈ వీడియోను షేర్ చేశారు. ఎంతో శుభ్రమైన పద్ధతిలో టూటీ ఫ్రూటీని తయారు చేస్తున్న వీడియో ఇది అంటూ వ్యంగ్యంగా కామెంట్‌ చేశారు. ఇది చూశాక చాలా మందికి టూటీ ఫ్రూటీ ఇష్టమైనదిగా మారిపోతుంది అంటూ క్యాప్షన్ పెట్టారు. మురికి నీళ్లలో, ఎలాంటి రక్షణ పద్దతులను పాటించకుండా, ఒంటిపై ఒక నిక్కరు మాత్రమే వేసుకుని కార్మికులు పనిచేయడం, ఇతర ప్రక్రియకు సంబంధించి, ఈ వీడియో చూసి నెటిజన్లు షాక్‌ అయ్యారు.

కేక్‌లు, డెజర్ట్‌లలో టూటీ ఫ్రూటీని చూడగానే తమ పరిస్థితి ఏంటి అంటూ నెటిజన్లు ఆవేదన వ్యక్తం చేశారు. ఆ తయారీ వాతావరణం, అపరిశుభ్రతను చూసి తీవ్ర అసహ్యానికి గురయ్యారు.  ఇకపై తినడానికి ఇది భయపడాల్సిందే  అంటూ  కామెంట్లు చేస్తున్నారు.

  కాటన్ క్యాండీ, ఐస్ గోలా, స్ట్రీట్ ఫుడ్స్ తయారీ వీడియోలు గతంలో చాలానే  వైరల్ అయ్యాయి. తాజా వీడియో కూడా  ఆహార భద్రతా ప్రమాణాలు (Food safety standards), అసంఘటిత చిన్న తరహా పరిశ్రమలలో పరిశుభ్రత లోపాన్ని ఎత్తిచూపుతోంది. మరోవైపు ఈ వైరల్ వీడియో ప్రామాణికత, ఎక్కడిది లాంటి వివరాలపై స్పష్టతలేనప్పటికీ, లేదా అందులో చూపించిన ఫ్యాక్టరీ వాతావరణంపై ఇప్పటివరకు ఏ ప్రముఖ టూటీ ఫ్రూటీ తయారీ సంస్థ గానీ, ఫుడ్‌ సేఫ్టీ అధికారులు గానీ అధికారికంగా స్పందించలేదు.

 

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)