Breaking News

Viral: బట్టల షాప్‌కు వెళ్లిన ఆవు.. పాపం ఏం నచ్చలేదేమో!

Published on Wed, 01/04/2023 - 17:45

మనకు  ఏమైనా వస్తువు కావాలంటే షాప్‌లోకి వెళ్లి తెచ్చుకుంటాం. కొత్త బట్టలు కొనుక్కోవాలంటే మాల్‌కు వెళ్లి సెలెక్ట్‌ చేసుకొని మరీ కొనుక్కుంటాం. మరి జంతువులకు కూడా ఏమైనా కొనుక్కోవాలనిపిస్తే ఎక్కడికి వెళ్తాయి. వాటికి కూడా షాపింగ్‌ చేయాలనిపిస్తే ఎలా ఉంటుంది. అచ్చం ఇలాంటి ఆలోచనే ఓ ఆవుకి వచ్చింది. స్టైలిష్‌ బట్టలు వేసుకొని అందంగా తయారవ్వాలనిపించిందేమో.. అనుకున్నదే తడువుగా బట్టల షాప్‌లోకి వెళ్లి షాపింగ్‌ చేసింది.

అదేంటి..! ఆవు బట్టల దుకాణానికి వెళ్లడం ఏంటి? అనుకుంటున్నారా.. ఈ మాటలు వినడానికి కొంచెం విడ్డూరంగానే అనిపించినా సరిగ్గా ఇలాంటి ఓ సరదా ఘటనే అస్సాంలో గత వారం చోటుచేసుకుంది. ధుబ్రి ప్రాంతంలో దారి తప్పిందో ఏమో గానీ ఓ ఆవు బట్టల షాప్‌లోకి ప్రవేశించింది. స్టోర్‌ మొత్తం కలియ తిరుగుతూ అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది. షాప్‌లో ఆవు తిరుగుతుంటే అక్కడున్న సిబ్బంది, షాపింగ్‌ చేస్తున్న మిగతా జనాలు భయంతో దూరంగా పరుగులు తీశారు. చివరికి దానంతట అదే బయటకు వెళ్లిపోయింది.

అక్కడున్న కొంతమంది ఈ తతంగాన్ని ఫోన్‌లో వీడియో తీశారు. దీనిని సోషల్‌ మీడియాలో షేర్‌ చేయడంతో  వైరల్‌గా మారింది.  అయితే ఆవు వాలకం చూస్తుంటే నిజంగా షాపింగ్‌ చేయడానికి వచ్చిన్నట్లే అనిపిస్తుంది. తనకు సంబంధించిన దుస్తులు ఎక్కడ ఉన్నాయా అనుకుంటూ అచ్చం  కస్టమర్‌లాగే  స్టోర్‌ మొత్తం షికారు చేసింది. చివరికి ఏవి నచ్చకపోవడంతో నిరుత్సాహ చెందింది. అంతేగాక.. బట్టల షాప్‌ వాళ్లు డబ్బులు అడగంతో అక్కడి నుంచి వెనుదిరిగినట్లు కనిపిస్తుంది. ఈ వీడియో చూసిన నెటిజన్లు కూడా ఇలాగే భావిస్తూ నవ్వుకుంటూ కామెంట్లు పెడుతున్నారు.

Videos

మాజీ సీఎం వైఎస్ జగన్ దెబ్బకు దిగొచ్చిన సర్కార్

బెడ్ రూమ్ లోకి కింగ్ కోబ్రా ఏం చేశాడో చూడండి..

వల్లభనేని వంశీ ఆరోగ్యంపై భార్య పంకజశ్రీ కీలక వ్యాఖ్యలు

విజయవాడ రైల్వే స్టేషన్ కు బాంబు బెదిరింపు

ప్రభుత్వం మాది..మీ అంతు చూస్తా : Pawan Kalyan

లక్షా 40 వేల కోట్ల అప్పు తెచ్చి ఏం చేశారు బాబుపై బొత్స ఫైర్

మీకు చుక్కలు చూపిస్తా! Deputy CM

Ding Dong 2.0: కామిక్ షో

రగిలిపోతున్న పవన్ కళ్యాణ్ సినిమా ఇండస్ట్రీకి వార్నింగ్

భారీగా పెరుగుతున్న కరోనా, దేశంలో హైఅలర్ట్..

Photos

+5

ప్రభాస్‌కి జోడీగా లక్కీఛాన్స్‌ కొట్టేసిన ఈ బ్యూటీ ఫొటోలు చూశారా..? (ఫోటోలు)

+5

900 ఏళ్ల నాటి కోటలో సుకుమార్‌ దంపతులు.. లండన్‌ ప్రిన్సెస్‌తో డిన్నర్‌ (ఫోటోలు)

+5

గ్రాండ్‌గా తలసాని శ్రీనివాస్ యాదవ్ సోదరుడి కొడుకు వివాహం (ఫొటోలు)

+5

ప్రియుడి బ‌ర్త్‌డే పార్టీలో స్మృతి మంధాన! (ఫోటోలు)

+5

ఏపీలోని ఈ గుడి చాలా స్పెషల్..దట్టమైన అటవీ ప్రాంతంలో వెలసిన అమ్మవారు (ఫొటోలు)

+5

కాళేశ్వరం : 'సల్లంగ సూడు సరస్వతమ్మా'..త్రివేణీ సంగమం భక్తజన సంద్రం (ఫొటోలు)

+5

మాదాపూర్ : హైలైఫ్ ఎగ్జిబిషలో మోడల్స్ సందడి (ఫొటోలు)

+5

ఆసక్తికరమైన ‘పైనాపిల్‌’ ఫ్యామిలీని చూశారా? (ఫొటోలు)

+5

Cannes 2025 : కాన్స్‌ రెడ్‌కార్పెట్‌పై,హొయలొలికించిన నటి ప్రణీత (ఫొటోలు)

+5

శ్రీవారితో కలిసి 14 కిలోమీటర్ల గిరిప్రదక్షిణచేసిన నటి వితికా షేరు (ఫొటోలు)