Breaking News

ప్రచారంలో యువతికి ముద్దు.. వివాదంలో బీజేపీ ఎంపీ

Published on Wed, 04/10/2024 - 14:26

కోల్‌కతా: దేశమంతటా ఎన్నికల వేడి రాజుకుంది. లోక్‌సభతోపాటు పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల సందడి నెలకొంది. పోలింగ్‌కు సమయం సమీపిస్తుండటంతో  నువ్వానేనా అన్నట్లుగా అధికార ప్రతిపక్షాలు ప్రచార జోరు పెంచాయి. ఓటర్లను ఆకర్షించుకునేందుకు విభిన్న రీతిలో ప్రచారం చేస్తూ హోరెత్తిస్తున్నారు.

తాజాగా పశ్చిమబెంగాల్‌లో ఓ బీజేపీ అభ్యర్ధి నిర్వహించిన ప్రచారం వివాదంలో చిక్కుకుంది.బెంగాల్‌ నార్త్‌ మల్దా నియోజవర్గం బీజేపీ ఎంపీ ఖగేన్‌ ముర్ము.. మరోసారి పార్టీ అభ్యర్థిగా బరిలో నిలిచారు. ఇటీవల ఆయన తన నియోజకవర్గ పరిధిలో ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో ఖగేన్‌.. ఓయువతి చెంపపై ముద్దు పెట్టాడు. చంచల్‌ శ్రిహిపూర్‌ గ్రామంలో సోమవారం ఈ ఘటన జరిగింది.  

ప్రచారంలో భాగంగా ఖగేన్‌ ముర్ము యువతికి ముద్దు పెట్టిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి. దీంతో ఈ ఘటన రాజకీయ దుమారాన్ని రేపింది.దీనిపై అధికార తృణమూల్‌ కాంగ్రెస్‌ స్పందిస్తూ బీజేపీపై విరుచుకుపడింది. కాషాయ పార్టీలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవేలేదని విమర్శలు గుప్పించింది.

‘బీజేపీ ఎంపీ బెంగాల్‌లోని ఉత్తర మాల్దా అభ్యర్ధి ఖగేన్‌ ముర్మూ తన ప్రచారంలో ఓ మహిళకు ముద్దు పెట్టారు. మహిళా రెజ్లర్లను లైంగికంగా వేధించే ఎంపీల నుంచి.. బెంగాలీ మహిళలపై అశ్లీల పాటలు రాసేటటువంటి నేతలు.. బీజేపీ శిబిజరంలో మహిళా వ్యతిరేక రాజకీయ నాయకులకు కొదవే లేదు. నారీమణులకు ‘మోదీ పరివార్‌’ ఇస్తున్న గౌరవం ఇది. ఒకవేళ వారు అధికారంలోకి వస్తే ఇలాంటివి ఇంకెన్ని చేస్తారో ఊహించుకోండి’ అంటూ ఎక్స్‌ వేదికగా మండిపడింది.

అయితే ఖగేన్‌ ముర్మూ తన చర్యలను సమర్ధించుకున్నారు. ఆమెను తన కుమార్తెలా భావించి, ముద్దు పెట్టినట్లు తెలిపారు. పిల్లలకు ముద్దు పెడితే తప్పేంటని ప్రశ్నించారు. కుట్రపూరితంగా దీనిపై వివాదం సృష్టిస్తున్నారని విమర్శించారు.
చదవండి: పతంజలి కేసు.. ‘క్షమాపణలు అంగీకరించం.. చర్యలు తప్పవు’

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)