Breaking News

దుర్గా నిమజ్జనంలో హింస.. ఒకరు మృతి

Published on Mon, 10/14/2024 - 07:17

లక్నో: ఉత్తరప్రదేశ్‌లోని బహ్రాయిచ్‌లో దుర్గా విగ్రహ నిమజ్జన ఊరేగింపులో హింస చెలరేగింది. ఒక వర్గానికి చెందినవారు రాళ్లు రువ్వడంతో పాటు తుపాకీతో కాల్పులు జరిపారు. ఈ కాల్పుల్లో ఓ యువకుడు మృతి చెందడంతో ఉద్రిక్తత  ఏర్పడింది. ఈ సమయంలో జరిగిన తొక్కిసలాటలో పలువురు గాయపడ్డారు. ఈ ఘటన అనంతరం జిల్లాలోని పలు చోట్ల హిందూ సంస్థలు నిరసనలు చేపట్టాయి. వెంటనే అప్రమత్తమైన పోలీసు అధికారులు ఘటనా స్థలంలో భారీగా పోలీసు బలగాలను మోహరించారు.

యూపీలోని బహ్రాయిచ్‌లో జరిగిన హింసాకాండపై జిల్లా ఎస్పీ వృందా శుక్లా మీడియాకు పలు వివరాలను అందించారు. ఈ ఉదంతంతో ప్రమేయమున్న 30 మందిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారని, సల్మాన్ అనే నిందితుడి ఇంటి దగ్గర కాల్పులు జరిగాయని తెలిపారు. 22 ఏళ్ల యువకుడు రామ్ గోపాల్ మిశ్రా కాల్పుల్లో  మృతిచెందాడన్నారు.

బహ్రాయిచర్‌ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్, పోలీసు స్టేషన్ ఇన్‌ఛార్జి హార్ది, మహసీ పోలీస్ పోస్ట్ ఇన్‌చార్జితో సహా ఆరుగురు పోలీసుల నిర్లక్ష్యాన్ని గుర్తిస్తూ ఉన్నతాధికారులు వారిని సస్పెండ్ చేశారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ మాట్లాడుతూ బహ్రాయిచ్‌లో చోటుచేసుకున్న ఘటనకు కారకులైనవారిని విడిచిపెట్టబోమని అన్నారు.  నిందితులను గుర్తించి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన అధికారులను ఆదేశించారు. 

ఇది కూడా చదవండి: రక్తమోడిన దేవరగట్టు

Videos

YSRCP నేతలు నామినేషన్లు వేయకుండా TDP మూకల దాడి

జగనన్న నాపై పెట్టిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటా

మా మిథున్ రెడ్డిని చంపేస్తారా? TDP గూండాల దాడిపై పెద్దిరెడ్డి రియాక్షన్..

రాష్టపతి దృష్టికి ఎంపీ మిథున్ రెడ్డి పై దాడి ఘటన

గంభీర్ మాస్టర్ ప్లాన్ .. వన్డేల నుండి బుమ్రా అవుట్?

నామినేషన్ కు ర్యాలీగా YS అవినాష్ రెడ్డి

మిథున్ రెడ్డికి జగన్ పరామర్శ TDP దాడులపై రియాక్షన్

LIVE : టీడీపీ గూండాల దాడులపై మిథున్ రెడ్డి సంచలన Press Meet

ఎన్నికల్లోనూ రెడ్ బుక్ రాజ్యాంగం.. మిథున్ రెడ్డిపై హత్యాయత్నం రోజా రియాక్షన్

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)