Breaking News

రెండు వర్గాల మధ్య ఘర్షణలు.. రాళ్లు రువ్వుకుంటూ..

Published on Mon, 07/31/2023 - 20:22

చంఢీగర్‌: హరియాణాలోని మేవాత్‌ ప్రాంతంలో రెండు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఆందోళనకారులు ఒకరిపై మరొఒకరు రాళ్లు రువ్వుకున్నారు. నిరసనకారులు పలు వాహనాలకు నిప్పు పెట్టారు. విశ్వ హిందూ పరిషత్ కార్యకర్తలు ర్యాలీ నిర్వహిస్తున్న క్రమంలో మరో వర్గం ప్రజలు వారిపై దాడి చేసినట్లు తెలుస్తోంది. గోరక్షక, భివానీ హత్య కేసు నిందితుడు మోను మానేసర్.. మేవాత్‌లో సంచరించిన నేపథ్యంలో ఈ అల్లర్లు చెలరేగినట్లు తెలుస్తోంది.

ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన నాసిర్, జునైద్ హత్య కేసులో మోనూ మానేసర్‌పై ఎఫ్‌ఐఆర్‌ నమోదైంది. అయితే.. బివానీ జిల్లాలో బొలేరో వాహనంలో మోనూ మానేసర్ సంచరించాడనే ఈ అల్లర్లు మొదలైనట్లు తెలుస్తోంది. భజరంగ్ దళ్‌ కార్యకర్తలు శోభా యాత్రలో పాల్గొనాలని మోనూ మానేసర్ కోరినట్లు తెలుస్తోంది. అనంతరం సోమవారం ఉదయం యాత్ర ప్రారంభమైన వెంటనే ఈ ఘటన జరిగినట్లు సమాచారం.

హరియాణా హోం మంత్రి అనిల్ విజ్ ఈ ఘటనపై స్పందించారు. విశ్వహిందూ పరిషత్ కార్యకర్తలు యాత్ర కోసం అనుమతులు పొందినట్లు చెప్పారు. కానీ దురదృష్టవశాత్తు ఇతర వర్గాల ప్రజలు దాడి చేసినట్లు పేర్కొన్నారు. మేవాత్ ప్రాంతంలో పోలీసులను మోహరించినట్లు స్పష్టం చేశారు. అల్లర్లను అదుపు చేయడానికి ఆగష్టు 2వరకు ఇంటర్నెట్‌ను నిలుపుదల చేస్తున్నట్లు చెప్పారు.  

ఇదీ చదవండి: విద్యార్థిని వాటర్ బాటిల్‌లో మూత్రం కలిపి.. ప్రభుత్వ బడిలో దారుణం..

Videos

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినానో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది వీడే.?ఎందుకు కాల్చడంటే..!

మైదుకూరు మున్సిపల్ ఎన్నికలు వాయిదా

Photos

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)

+5

వరంగల్ : అంబరాన్నంటిన సద్దుల బతుకమ్మ వేడుకలు (ఫోటోలు)