Breaking News

వరదలకు కొట్టుకుపోయిన రోడ్డు.. డోలీనే అంబులెన్స్‌గా మార్చి..

Published on Tue, 09/24/2024 - 06:57

చంపావత్: ఉత్తరాఖండ్‌లో హృదయవిదారక ఉదంతానికి సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇది అందరినీ కంటతడి పెట్టిస్తోంది. రాష్ట్రంలో ఇటీవల సంభవించిన వరదల కారణంగా చంపావత్ జిల్లాలోని సీల్ గ్రామానికి వెళ్లే రహదారి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో ఈ గ్రామానికి ఇతర ప్రాంతాలతో సంబంధం పూర్తిగా తెగిపోయింది. అయితే  ఇదే సమయంలో గ్రామంలో అనారోగ్యంతో బాధపడుతున్న వృద్ధురాలు లక్ష్మీదేవి(60)ని ఆస్పత్రికి తరలించడంలో చేయూతనందించి మానవత్వాన్ని చాటుకున్నారు ఆ గ్రామస్తులు.

గ్రామం నుంచి ఆస్పత్రికి వెళ్లే రోడ్డు పూర్తిగా అస్తవ్యస్తంగా మారడంతో గ్రామస్తులు డోలీ సాయంతో బాధితురాలు లక్ష్మీదేవిని సుమారు మూడు కిలోమీటర్లు ముందుకు తీసుకువెళ్లి, ఆస్పత్రికి తరలించారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. సీల్ గ్రామంలో  ఉంటున్న జోగా సింగ్ భార్య లక్ష్మీదేవి ఆరోగ్యం ఒక్కసారిగా క్షీణించింది. ఆస్పత్రికి తరలించేందుకు రోడ్డు మార్గం సరిగాలేదు. ఇలాంటి పరిస్థితుల్లో గ్రామస్తులు సాయం చేసేందుకు ముందుకు వచ్చారు. డోలీ సాయంతో ఆమెను ఆస్పత్రికి  తరలించారు. గంగలి, నేత్ర సలాన్‌ల మధ్య రోడ్డు పూర్తిగా మూసుకుపోయిందని గ్రామస్తులు తెలిపారు. వీలైనంత త్వరగా రోడ్డును బాగుచేయించాలని గ్రామస్తులు అధికారులను కోరుతున్నారు.

 


ఇది కూడా చదవండి: మానవత్వమా.. కళ్లు మూసుకో!

 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)