Breaking News

దారుణం: సగం గుండు కొట్టించి.. మెడలో చెప్పుల దండలు వేసి..

Published on Tue, 07/04/2023 - 11:07

రాంచీ: జార్ఖండ్‌లోని సాహిబ్‌గంజ్‌లో అమానవీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దొంగతనం చేసి దొరికిపోయిన ఇద్దరు యువకులను స్థానికలు పట్టుకుని శిరోముండనం చేశారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి.. ఓ బురద గుంటలో నిల్చోబెట్టారు. ఈ దారుణ ఘటన రాజ్‌మహల్ పోలీసు స్టేషన్ పరిధిలో జరిగింది.

ఇద్దరు యువకులు ఓ మహిళ ఇంట్లో రూ.4300 దొంగతనం చేశారు. ఇందులో ఓ బాలుడు దొరికిపోయాడు. అతన్ని పట్టుకున్న స్థానికులు మరో బాలున్ని ఇంట్లో నుంచి లాక్కొచ్చారు. ఊర్లో అందరి సమక్షంలోనే సగం గుండు కొట్టించారు. అనంతరం చెప్పుల దండలు మెడలో వేసి, ఊరేగించారు. ఈ ఘటనను కొందరు యువకులు వీడియోలు తీసి సామాజిక మాధ్యమాల్లో పోస్టు చేశారు. ఇవి కాస్త వైరల్‌గా మారాయి. 

ఈ ఘటనపై స్పందించిన పోలీసులు.. బాధితుల ఫిర్యాదుల మేరకు కేసు నమోదు చేశారు. పిల్లలను ఆరు గంటల పాటు బురదలోనే నిల్చొబెట్టారని బాధితుల తల్లిదండ్రులు ఆరోపించారు. రూ.3000 విధించిన జరిమానా చెల్లించిన తర్వాతనే పిల్లలను వదిలిపెట్టారని పోలీసులకు చెప్పారు. దర్యాప్తు కొనసాగిస్తామని పోలీసులు తెలిపారు. దోషులపై కఠిన శిక్షలు విధిస్తామని వెల్లడించారు.

ఇదీ చదవండి: డ్రైవింగ్‌లో ‘భ్రాంతి’ ముప్పు!.. 50% రోడ్డు ప్రమాదాలకు కారణమిదే!

  

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)