Breaking News

గూగుల్‌ మ్యాప్స్‌ టీమ్‌పై దాడి.. వామ్మో అసలు కారణం ఇదా?

Published on Fri, 08/29/2025 - 20:06

కాన్పూర్: గూగుల్ మ్యాప్స్ బృందానికి ఒక్కసారిగా షాక్‌ కొట్టినంత పనైంది. గూగుల్ మ్యాప్స్ కోసం సర్వే చేయడానికి ఉత్తరప్రదేశ్‌లోని కాన్పూర్ జిల్లా బిర్హార్ గ్రామానికి వెళ్లిన బృందంపై గ్రామస్థులు దాడికి పాల్పడ్డారు. అయితే, వారిని దొంగలుగా అనుమానించి గ్రామస్థులు దాడి చేసినట్లు పోలీసులు తెలిపారు.

 గూగుల్ మ్యాప్స్‌లో రహదారి సమాచారం అందించేందుకు టెక్ మహీంద్రా నుంచి ప్రత్యేకంగా కెమెరాలు అమర్చిన వాహనంతో బృందం గ్రామంలోని వీధులను మ్యాపింగ్‌కు ఫొటోలు తీశారు. అయితే, కెమెరాలు అమర్చిన వాహనాన్ని చూసిన గ్రామస్థులు అనుమానంతో.. వారు దొంగతనం చేయడానికి ముందస్తుగా సమాచారం సేకరిస్తున్నారని భావించారు. ఒక్కసారిగా గ్రామస్థుల గుంపు బృందాన్ని చుట్టుముట్టి, వాహనాన్ని అడ్డగించి ప్రశ్నలు అడగడం ప్రారంభించారు. ఈ క్రమంలో కొందరు గ్రామస్థులు.. బృంద సభ్యులపై దాడికి దిగారు.

ఈ సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని గ్రామస్థులు, సర్వే బృందాన్ని పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లి విచారణ జరిపారు. అక్కడ గూగుల్ మ్యాప్స్ బృందం తమ పని గురించి వివరించడంతో గ్రామస్థులు శాంతించారు. ఇదిలా ఉండగా.. తాము దొంగలం కాదని చెబుతున్నా వినకుండా తమపై దాడి చేసినట్లు సర్వే బృందం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ గ్రామాన్ని సర్వే చేసేందుకు వెళ్లామని, అందుకు డీజీపీ నుంచి అనుమతి కూడా తీసుకున్నామని తెలిపారు.

ఈ ఘటనపై పోలీసులు వివరణ ఇస్తూ.. ఇటీవల కాలంలో ఆ గ్రామంలో అధికంగా చోరీలు జరుగుతున్నాయని.. దీంతో గ్రామస్థులు.. వాహనానికి కెమెరాలు అమర్చి గ్రామంలో తిరుగుతున్న గూగుల్‌ మ్యాప్స్‌ బృందాన్ని దొంగలుగా భావించి ఉండొచ్చని పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయలేదని.. ఇరువర్గాలకు నచ్చజెప్పి పంపించినట్లు పోలీసులు చెప్పారు.


 

 

 

 

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)