Breaking News

అది ‘వితంతువుల గ్రామం’.. పురుషుల అకాల మృతికి కారణమిదే..!

Published on Mon, 07/24/2023 - 09:39

మన దేశంలోని రాజస్థాన్‌లోగల ఒక గ్రామం ‘వితంతువుల గ్రామం’గా పేరొందింది. ఈ గ్రామానికి చెందిన మగవారు అకాలంగా మృత్యువాత పడుతుంటారు. ఇటువంటి పరిస్థితుల్లో అక్కడి వితంతువులు కుటుంబాన్ని పోషించేందుకు పడరాని పాట్లు పడుతుంటారు. రోజుకు 10 గంటల పాటు బండరాళ్లను పగులగొట్టే పనులు చేస్తూ ఎంతోకొంత సంపాదిస్తుంటారు. 

సరైన సమయంలో చికిత్స  అందకపోవడంతో..
రాజస్థాన్‌లోని బూందీ జిల్లాలోని బుధ్‌పూర్‌ గ్రామంలో వితంతువులు అత్యధిక సంఖ్యలో ఉన్నారు. ఈ గ్రామంలో పురుషులు త్వరగా మృతి చెందడానికి గల కారణాలను శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఈ ‍ప్రాంతంలోని గనులలో పనిచేస్తున్న పురుషులు సిలికోసిస్‌ అనే అత్యంత ప్రమాదకర వ్యాధి బారిన పడుతున్నారు. సరైన సమయంలో వారికి తగిన చికిత్స అందకపోవడంతో అకాల మరణానికి గురవుతున్నారు. 

చిన్నారుల బాల్యం బుగ్గిపాలు
ఇంటికి పెద్దదిక్కు మరణించడంతో ఆ ఇంటిలోని మహిళలపై కుటుంబ పోషణభారం పడుతుంది. బాధిత కుటుంబాల్లోని పిల్లలు కూడా తల్లికి చేదోడువాదోడుగా ఉంటారు. ఫలితంగా వారి బాల్యం బుగ్గిపాలవుతున్నదనే వాదనలు వినిపిస్తుంటాయి. ఈ ప్రాంతంలో వ్యాధి బారినపడిన పురుషులకు ఆ విషయం 50 శాతం వ్యాధి ముదిరాక తెలుస్తోంది. దీంతో చికిత్స పూర్తిస్థాయిలో అందేలోగానే వారు కన్నుమూస్తున్నారు. ఇక్కడి గనుల్లో పనిచేసే కూలీలకు ఆయా గనుల యజమానులు తగిన రక్షణ పరికరాలు కూడా అందించడం లేదనే వాదన వినిపిస్తుంటుంది. కార్మికుడు ఎవరైనా చనిపోయినా బాధిత కుటుంబాన్ని యజమానులు పట్టించుకోవడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.
ఇది కూడా చదవండి: పిల్లల ఫేమస్‌ కోసం తల్లి తాపత్రయం.. ఊహకందని చేదు అనుభవం ఎదురయ్యేసరికి..

Videos

మొత్తం ఫుటేజ్ చూసి KCR ఏం అన్నాడంటే..?

స్పీకర్ వివాదం.. తాతా మధు చేసిన కామెంట్స్ ఇవే

నందుస్ వరల్డ్ అరెస్ట్ EXCLUSIVE VIDEO

Nepal Floods: తల్లి, కుమార్తె వరదలో చిక్కుకున్న దృశ్యాలు.. కన్నీళ్లు తెప్పిస్తున్న వీడియో

నోరు అదుపులో పెట్టుకో.. ఉదయనిధికి సినిమా రేంజ్ లో కౌంటర్

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)