లేఖ బయటకి వస్తే రాజకీయ ప్రకంపలను ఖాయం
Breaking News
Vande Bharat: ఏసీ కోచ్‌లో లీకైన నీళ్లు.. ఇక నా డబ్బులో నాకివ్వండి!
Published on Tue, 06/24/2025 - 21:52
న్యూఢిల్లీ: వందే భారత్ ట్రైన్‌లో ఏసీ కోచ్‌లో నీళ్లు లీకైన ఘటన తాజాగా వెలుగుచూసింది. ఢిల్లీ నుంచి వెళ్ళ్లే ఓ వందే భారత్ ట్రైన్‌లో ఏసీ పని చేయకపోవడంతో వాటర్ లీకేజ్ ఏర్పడింది. తాను వందే భారత్ ట్రైన్‌లో ప్రయాణించిన సమయంలో ఏసీ నుంచి నీళ్లు ధారలా తన సీటపైకి వచ్చాయన్నాడు ధర్శిల్ మిశ్రా అనే వ్యక్తి ఫిర్యాదు చేశాడు.
ఇలా లీకేజ్ జరుగుతూనే ఉందని, ఈ విషయాన్ని రైల్వే సిబ్బందికి రిపోర్ట్ చేసినా ఎటువంటి చర్యలు తీసుకోలేదన్నారు. దీనికి సంబంధించి వీడియోను షేర్ చేస్తూ.. ఇది నా కోచ్‌లో జరిగిందంటూ పేర్కొన్నాడు. అత్యధిక ఖరీదుతో కొనుగోలు చేసిన వందే భారత్ ట్రైన్‌లో ఇలా జరగడంపై అసహనం వ్యక్తం చేశాడు. ‘ప్రయాణంలో సుఖం లేదు. అంతా అసౌకర్యమే. రైల్వే సిబ్బందికి పట్టించుకోలేదు. మరి అటువంటప్పుడు నేను టికెట్ కొన్న డబ్బులు తిరిగి చెల్లించండి’ అంటూ పేర్కొన్నాడు.
— Darshil Mishra (@MishraDarshil) June 23, 2025
Tags : 1