Breaking News

షాకింగ్ వీడియో.. వరద నీటిలో ముగినిపోయిన వందలాది కార్లు

Published on Tue, 07/25/2023 - 20:34

దేశ వ్యాప్తంగా వర్షాలు వణికిస్తున్నాయి. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వానలతో ప్రజలు ఆగమాగం అవుతున్నారు. కుండపోత వర్షాలతో వాగులు, నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. జనావాసాల్లోకి వరద నీరు వచ్చి చేరుతోంది. రోడ్లన్నీ చెరువులను తలపిస్తుండగా.. రహదారులు, కాలనీలు ఇలా ఎక్కడ చూసిన వరద నీరే కనిపిస్తుంది. ట్రాఫిక్‌ జామ్‌ ఏర్పడి వాహనాలు ముందుకు కదలడం లేదు. 

తాజాగా దేశ రాజధాని ఢిల్లీతోసహా ఉత్తర భారత దేశంలో కురుస్తున్న భారీ వర్షాలతో విపత్కర పరిస్థితులు తలెత్తుతున్నాయి. యమునా ఉప నది అయిన హిండన్‌ నది నీటిమట్టం పెరగడంతో గ్రేటర్‌ నోయిడా మునిపోయింది. ఓ బహిరంగ ప్రదేశంలో పార్క్‌ చేసిన దాదాపు 200కు పైగా కార్లు నీట మునిగాయి. ఈ ఘటన గ్రేటర్ నోయిడాలోని ఎకోటెక్-3 సమీపంలో వెలుగుచూసింది. దీనికి సంబంధించిన షాకింగ్‌ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఇందులో వరస క్రమంలో పార్క్‌ చేసిన తెలుపు రంగు కార్ల పైకప్పుల వరకు వరద నీరు కప్పేసి ఉండటం కనిపిస్తోంది. 

హిండన్‌లో నీటి మట్టం పెరగడంతో శనివారం నదికి సమీపంలో ఉన్న వారిని తమ ఇళ్ల నుంచి ఖాళీ చేయించారు అధికారులు. ప్రభావిత ప్రాంతాల్లో నోయిడా సెక్టార్ 63లోని ఎకోటెక్, ఛిజార్సీ ఉన్నాయి. నోయిడా, ఢిల్లీ ప్రాంతంలోని ఇతర ప్రాంతాలలో ఈరోజు తెల్లవారుజామున తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిశాయి. ఈరోజు మధ్యాహ్న సమయానికి యమునా నది ప్రమాదకర స్థాయి (205.33 మీటర్లు) మించి ప్రవహిస్తోంది. మధ్యాహ్నం 205.4 మీటర్ల స్థాయిలో ఉంది. 

Videos

Nandana ఇండియాకు ఎందుకు వచ్చింది? కారణం ఇదేన..!

ఇదేం క్రేజ్ రా అయ్యా ! వైభవ్ కోసం పోటెత్తిన చెపాక్

300 మంది బలి.. ఫస్ట్ రోడ్లు మంచిగా వేయండి డేటా సెంటర్లు కాదు

కంటతడి పెట్టుకున్న సీతక్క, స్పీకర్

బైకర్‌కు తృటిలో తప్పిన ప్రమాదం.. భారీ కొండచరియలు విరిగిపడిన ఘటన వైరల్

లోకేష్ ఇది ఆరంభం మాత్రమే.. DSC అక్రమాలపై YS అవినాష్ రెడ్డి రియాక్షన్

సాక్షితో మెగా ఫేక్ టీచర్ లోకేష్ అక్రమాల పుట్ట బద్దలు

ఎయిర్‌పోర్టులో నందూస్ కపుల్‌ను పట్టుకున్న పోలీసులు!

గంటగంటకు పడిపోతున్న బంగారం ధరలు తులం ఎంతంటే?

ఏమమ్మా బాబు పాలన ఎలా ఉంది? కేతిరెడ్డి ఎదురుగా చంద్రబాబు పరువు తీసిన మహిళా

Photos

+5

అప్సరసగా అందాల రాశీ ..(షూటింగ్‌ ఫొటోస్‌)

+5

తెలంగాణ అసెం‍బ్లీ : బీఆర్‌ఎస్‌ నిరసనపై పోలీసుల ఉక్కుపాదం (ఫొటోలు)

+5

‘రోమాంచకం’ మూవీ సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

బిగ్‌బాస్ హౌస్‌లో అడుగుపెట్టిన గ్లామరస్ యాంకర్ వర్షిణి (ఫొటోలు)

+5

‘మహేంద్రగిరి వారాహి’ ప్రీ రిలీజ్‌ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

సారీలో సారా.. ధురుంధర్‌ భామ (ఫొటోలు)

+5

పూల మధ్యలో పుత్తడి బొమ్మలా.. అందాల సోయగం శ్రీలీల ఫొటోలు

+5

సద్గురుతో సమంత ఆధ్యాత్మిక ప్రయాణం.. ఫొటోలు

+5

తెలుగు బిగ్‌బాస్‌ సీజన్‌ 10... కంటెస్టెంట్స్‌ వీళ్లే (ఫొటోలు)

+5

ఘనంగా ‘మండాడి’ ప్రీ రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)