Breaking News

Video: చిరుతపులి బీభత్సం.. కోర్టు ఆవరణంలోకి ప్రవేశించి, ఆరుగురిపై దాడి

Published on Wed, 02/08/2023 - 21:20

లక్నో: కోర్టు కాంప్లెక్స్‌లోకి చొరబడిన ఓ చిరుతపులి స్థానికంగా బీభత్సం సృష్టించింది. కోర్టు అంతా సంచరిస్తూ పలువురిపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచింది. ఈ ఘటన ఉత్తరప్రదేశ్‌లోని ఘజియాబాద్‌లో చోటుచేసుకుంది. ఘజియాబాద్‌ కోర్టులోని మొదటి అంతస్తులోకి బుధవారం సాయంత్రం అకస్మాత్తుగా ఓ చిరుతపలి ప్రవేశించింది. 

కోర్టు ప్రాంగణంలో చిరుతపులి కనిపించడంతో భయంతో అక్కడున్న వారంతా అటు ఇటు పరుగులు తీశారు. చిరుత నుంచి తమను తాము రక్షించుకునేందుకు కొంతమంది లాయర్లు లాయర్లు తమ గదుల్లోకి వెళ్లి లాక్‌ చేసుకున్నారు. దీంతో ఒక్కసారిగా కోర్టు ఆవరణంలో గందరగోళం నెలకొంది.

చుట్టూ జనాలను చూసి బెంబేలెత్తిన చిరుతపులి మరింత రెచ్చిపోయింది. కర్రల సాయంతో తరిమికొట్టేందుకు వెళ్లిన లాయర్‌పై చిరుతపులిని దాడి చేసింది. అంతేగాక కోర్టు ఆవరణలో చెప్పులు కుట్టే వ్యక్తి, పోలీస్‌ అధికారితో సహా పలువురిపై దాడి చేస్తూ తీవ్రంగా గాయపరిచింది.

చిరుతపులి సంచారంపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వారిని హుటాహుటినా ఆసుపత్రికి తరలించారు. అనంతరం నాలుగు గంటలు శ్రమించిన అటవీశాఖ సిబ్బంది ఎట్టకేలకు చిరుతపులిని నెట్‌లో బంధించి అదుపులోకి తీసుకున్నారు. కోర్టు వద్ద చిరుతపులి సంచారం.. న్యాయవాదులను గాయపరిచిన దృశ్యాలు సోషల్‌ మీడియాలో వైరల్‌గా మారాయి.

Videos

ప్రొద్దుటూరులో ఉద్రిక్తత పోలీస్ లారీ ఛార్జ్ తిరగబడ్డ YSRCP నేతలు

Rashmika: బతుకమ్మను నెత్తిన పెట్టుకొని... బతుకమ్మ సంబరాలు

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ ష్రాఫ్‌ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)