Breaking News

Video: పద్మనాభస్వామి ఆలయంలోకి విదేశీ మహిళకు ప్రవేశం నిరాకరణ

Published on Wed, 07/17/2024 - 13:07

తిరువ‌నంత‌పురం: పవిత్రమైన దేవాలయంలోకి విదేశీ మహిళను వెళ్లకుండా అడ్డుకున్న ఘటన కేరళలోని పద్మానాభస్వామి ఆలయంలో చోటుచేసుకుంది. కేవలం భారతీయులకు మాత్రమే ఆలయంలోకి అనుమతి ఉందంటూ ఆమెను లోపలికి వెళ్లనివ్వలేదు. అయితే తన భర్త భారతీయుడేనని, వారికి నిశ్చితార్థం కూడా జరిగిందని చెప్పినా ఆలయ అధికారులు పట్టించుకోలేదు.. ఈ మేరకు  సదరు విదేశీ మహిళకు ఎదురైన అనుభవాన్ని హర్‌ప్రీత్‌ అనే మహిళ సోషల్‌ మీడియాలో పంచుకున్నారు.

విదేశాలకు చెందిన మహిళ చక్కగా చీర కట్టుకొని తనకు కాబోయే భ‌ర్త‌తో పద్మనాభ స్వామి ఆల‌యాన్ని సంద‌ర్శించాల‌నుకుంది. కానీ అక్క‌డ ఉన్న సిబ్బంది.. ఆల‌యంలోకి ప్ర‌వేశించేందుకు ఆమెకు అనుమ‌తి ఇవ్వ‌లేదు. తన జాతీయత, మతం కారణంగా ఆలయంలోకి ప్రవేశాన్ని నిరాకరించినట్లు ఆమె వాపోయింది. భారతీయులకు మాత్ర‌మే ఆల‌య అనుమతి ఉంటుంద‌ని అధికారులు చెప్పిన‌ట్లు వీడియోలో పేర్కొంది. త‌న‌తో ఎంగేజ్‌మెంట్‌ జ‌రిగిన‌ట్లు ఇండియన్‌ అయిన ఆమె ప్రియుడు  చెప్పినా.. ఆల‌య సిబ్బంది ఆ విదేశీ మ‌హిళ‌కు గుడిలోకి అనుమ‌తి ఇవ్వ‌లేదు.

తాను హిందువునే అని ఆ మ‌హిళ వీడియోలో చెప్పుకున్నప్పటికీ అధికారులు స‌ర్టిఫికేట్ చూపించాలంటూ కోరారని తెలిపింది. ప్రతిసారి సర్ఠిఫికేట్‌ తీసుకెళ్లడం ఎలా సాధ్యమవుతుందని ప్రశ్నించింది. తాను భార‌తీయుడిని పెళ్లి చేసుకోబోతున్నాన‌ని, భ‌గ‌వ‌ద్గీత‌ను చ‌ద‌వుతాన‌ని, అయినా  సెక్యూర్టీ గార్డులు త‌న‌ను ఓ నేరస్థురాలిగా చూస్తున్నార‌ని ఆమె త‌న వీడియోలో ఆరోపించింది.  ఆల‌య అధికారులు వ‌ర్ణ‌వివ‌క్ష‌ను ప్ర‌ద‌ర్శించిన‌ట్లు  ఆరోపించింది. కేవ‌లం ఆల‌యంలో ప్ర‌వేశించేందుకు మాత్ర‌మే చీర‌ను కొన్న‌ట్లు ఆమె చెప్పుకొచ్చింది.

 ప్రస్తుతం ఈ వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది.తాజాగా ఈ వీడియోపై కాంగ్రెస్‌ నేత కార్తీ చిదంబరం స్పందించారు. ప్రార్ధన స్థలానికి వెళ్లి పూజలు చేయాలనుకున్న వ్యక్తులను ఎందుకు అడ్డుకుంటున్నారని ప్రశ్నించారు. మరోవైపు అనేకమంది ఈ వీడియోపై రియాక్ట్‌ అవుతున్నారు. కొంతమంది ఆలయాల్లోకి విదేశీయులను అనుమతించాలని కోరగా.. మరికొందరు సంప్రదాయాలను గౌరవించాలని చెబుతున్నారు.

 

"మతం,  జాతీయతతో సంబంధం లేకుండా ఎవరినైనా హిందూ దేవాలయాలలోకి అనుమతించాలి. కేవలం వారి దుస్తులు, శాఖాహారం తినడం, చెప్పులు తీయడం వంటి ఆలయ సంస్కృతిని గౌరవించాలనే షరతులు మాత్రమే ఉండాలి. అని సూచిస్తున్నారు. ఇక దేవాలయాలు అందరూ సందర్శించడానికి టూరిస్టు ప్రదేశాలు కాదని, మీ ఇంట్లోకి ఎవరినైనా అనుమతిస్తారా? ఇవ్వరు కదా!. వారు హిందూ మతాన్ని విశ్వసిస్తున్నట్లు రాతపూర్వకంగా డిక్లరేషన్‌ ఇస్తే  ఆలయంలోకి అనుమతించాలి’ అని కొందరు కామెంట్‌ చేస్తున్నారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)