Breaking News

‘ఎందుకు నాశనం చేశావ్‌’.. కోర్టు ప్రాంగణంలో నిందితుణ్ణి నిలదీసిన బాధితురాలు

Published on Sun, 01/26/2025 - 11:57

మధ్యప్రదేశ్‌లోని ఇండోర్ జిల్లాలో ఆసక్తికర ఉదంతం చోటుచేసుకుంది. ఒక అత్యాచార నిందితుణ్ణి పోలీసులు కోర్టుకు తీసుకువస్తుండగా, విషయం తెలుసుకుని అక్కడకు వచ్చిన బాధితురాలు కోర్టు ప్రాంగణంలో హల్‌చల్‌ చేసింది.  

వివరాల్లోకి వెళితే  కొద్ది రోజుల క్రితం ఇండోర్‌లోని సిమ్రోల్‌లో ఒక యువతి (బీజేపీ మహిళా నేత)పై అత్యాచారం చేశాడనే ఆరోపణలతో స్థానిక సర్పంచ్ భర్త  లేఖరాజ్ దాబీపై కేసు నమోదైంది.  శనివారం సిమ్రోల్ పోలీసులు నిందితుడు లేఖరాజ్ దాబీని ఇండోర్ కోర్టుకు తీసుకువచ్చారు. ఈ విషయం బాధితురాలికి తెలియడంతో ఆమె ఇండోర్ జిల్లా కోర్టుకు చేరుకుంది. కోర్టు ఆవరణలో పోలీసుల ముందే బాధితురాలు నిందితుడిని కొట్టింది. ‘నా జీవితాన్ని ఎందుకు నాశనం చేశావు?" అని నిలదీస్తూ తన కోపాన్ని వ్యక్తం చేసింది. ఈ సంఘటన అక్కడున్న అందరినీ దిగ్భ్రాంతికి గురిచేసింది. దీనికితోడు పోలీసులు నిందితుడిని ప్రత్యేక కారులో తీసుకురావడం చర్చనీయాంశంగా మారింది.

నిందితునికి మాజీ మంత్రి, ప్రస్తుత ఎమ్మెల్యే అండదండలున్నాయని బాధితురాలు పోలీసుల ముందు ఆరోపించింది. అత్యాచారం కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన తర్వాత నిందితుడిని బీజేపీ ప్రాథమిక సభ్యత్వం నుండి ఆరు సంవత్సరాల పాటు పార్టీ బహిష్కరించింది. అత్యాచారం తర్వాత తనకు గర్భస్రావం చేయించాడని బాధితురాలు ఆరోపించింది.  అతనికి మరికొందరు మహిళలతోనూ సంబంధాలున్నాయని ఆమె పేర్కొంది.

ఇది కూడా చదవండి: Republic Day 2025: మువ్వన్నెల రైల్వే స్టేషస్లు.. మురిసిపోతున్న ప్రయాణికులు

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)