ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం

Published on Tue, 09/09/2025 - 09:42

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం

  • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌ ఘన విజయం
  • 452 ఓట్లు సాధించిన సిపి రాధాకృష్ణ
  • 98.2 పోలింగ్ శాతం నమోదు
  • చెల్లని ఓట్లు 15

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్‌   

  • ఉపరాష్ట్రపతి ఎన్నిక.. ముగిసిన పోలింగ్‌   
  • ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీఏ తరఫున మహారాష్ట్ర గవర్నర్ సీ.పీ. రాధాకృష్ణన్
  • ప్రతిపక్ష ఇండియా కూటమి తరఫున మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి బి. సుదర్శన్ రెడ్డి పోటీ
  • ఇందుకోసం పార్లమెంట్ భవనంలో ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు పోలింగ్‌ 
  • సాయంత్రం 6 గంటల తర్వాత ప్రారంభం కానున్న ఓట్ల లెక్కింపు  
  • ఫలితాలు ఈ రాత్రి ప్రకటించబడే అవకాశం ఉంది.

ఓటింగ్‌కు దూరంగా ఉన్న పార్టీలు

  • బీఆర్‌ఎస్, బీజేడీ,శిరోమణి అకాలీ దళ్‌లు ఓటింగ్‌కు దూరం 
  • వీరి నిర్ణయం వల్ల తగ్గిన ఓటింగ్‌ 
  • కానీ ఎన్డీఏకు స్పష్టమైన ఆధిక్యం ఉందని అంచనా

ఓటేసిన లోక్‌సభ స్పీకర్‌

ఉపరాష్ట్రపతి ఎన్నిక.. కొనసాగుతున్న పోలింగ్‌

ఓటేసిన లోక్‌సభ స్పీకర్‌ ఓం బిర్లా

ఇది బీజేపీకి ఎదురుదెబ్బే: సంజయ్‌ రౌత్‌

ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌కు బీఆర్‌ఎస్‌, బీజేడీ, అకాలీదళ్‌ దూరం

ఈ మూడు బీజేపీతో గతంలో అంటకాగిన పార్టీలేనన్న శివసేన ఎంపీ సంజయ్‌​ రౌత్‌

ఇప్పుడు దూరంగా ఉండడం ఆ పార్టీకి ఎదురుదెబ్బేనని వ్యాఖ్య

96 శాతం పోలింగ్‌ నమోదు

కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి ఎన్నిక పోలింగ్‌

3గం. దాకా 96 శాతం పోలింగ్‌ నమోదు

5 గం. దాకా జరగనున్న పోలింగ్‌

6గం. కౌంటింగ్‌ మొదలు

7.45గం. కి ఫలితం వెల్లడి

ఇండియా కూటమి వైపే ఒవైసీ

ఇండియా కూటమి అభ్యర్థిగా జస్టిస్‌ బీ సుదర్శన్‌రెడ్డి

సుదర్శన్‌రెడ్డికి మద్దతు ప్రకటించిన ఎంఐఎం

హైదరాబాద్‌వాసి, గౌరవనీయుడైన న్యాయకోవిదుడికి మద్దతంటూ ఒవైసీ ట్వీట్‌

ఓటు హక్కు వినియోగించుకున్న ఒవైసీ

విజయంపై ఎన్డీయే ధీమా

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్‌

రాత్రికల్లా వెలువడనున్న ఫలితం

సంఖ్యా బలం దృష్ట్యా..  విజయంపై ఎన్డీయే ధీమా

ముందస్తుగా.. విందు ఏర్పాట్లలో ముమ్మరం

కేంద్ర మంత్రి ప్రహ్లాద్‌ ఇంట ఎన్టీయే కూటమి కీలక నేతలకు విందు ఏర్పాట్లు

ఓటు హక్కు వినియోగించుకున్న వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఉపరాష్ట్రపతి ఎన్నికల్లో ఓటేసిన వైఎస్సార్‌సీపీ ఎంపీలు

ఎన్డీఏ అభ్యర్థి రాధాకృష్ణన్‌కి మద్దతు  ప్రకటించిన వైఎస్సార్‌సీపీ


పోలింగ్‌కు దూరంగా మరో పార్టీ

ఉపరాష్ట్రపతి ఎన్నికలకు దూరంగా శిరోమణి అకాలీదల్

పార్లమెంట్‌లో ఎస్‌ఏడీ సంఖ్యా బలం.. మూడు

ఈ ఎన్నికలకు దూరంగా ఉంటామని ఇప్పటికే ప్రకటించిన బీజేడీ, బీఆర్‌ఎస్‌

ఓటు హక్కు వినియోగించుకోనున్న 769 మంది ఎంపీలు

కొనసాగుతున్న ఉపరాష్ట్రపతి పోలింగ్‌

ఒక్కొక్కరుగా ఓటు వేస్తున్న ఎంపీలు

సాయంత్రం 6గంటల తర్వాత వెలువడనున్న ఫలితాలు

తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

ఉపరాష్ట్రపతి ఎన్నికల పోలింగ్‌ ప్రారంభం

తొలి ఓటు వేసిన ప్రధాని మోదీ

అనంతరం.. సోనియా గాంధీ, ప్రియాంక గాంధీ, జేపీ నడ్డా, మల్లికార్జున ఖర్గే తదితరులు

ఓటింగ్‌ వేళ ప్రత్యేక ఆకర్షణగా కాంగ్రెస్‌ ఎంపీ శశిథరూర్‌

ఓటేశాక.. మీడియాతో మాట్లాడకుండా వెళ్లిపోయిన రాహుల్‌ గాంధీ

సాయంత్రం ఐదు గంటల దాకా జరగనున్న పోలింగ్‌

ఎంపీలకు గులాబీ రంగు బ్యాలెట్‌ పత్రాలు పంపిణీ 

నో విప్‌.. తమకు నచ్చిన అభ్యర్థికి ప్రాధాన్యం ప్రకారం ఓట్లేయనున్న ఎంపీలు 

నచ్చిన అభ్యర్థి పేరుకు ఎదురుగా గడిలో 1 అంకె

తదుపరి ప్రాధాన్యం ఇచ్చే అభ్యర్థి పేరు ఎదుటనున్న గడిలో 2 అంకె 

ఎన్నికల సంఘం సమకూర్చే పెన్నుతోనే మార్కింగ్‌

ఉపరాష్ట్రపతి ఎన్నికకు సర్వం సిద్ధం

మరికాసేపట్లో పార్లమెంటు భవనంలోని ‘ఎఫ్‌-101 వసుధ’లో ప్రారంభం కానున్న పోలింగ్‌ 

6 గంటలకు ఓట్ల లెక్కింపు 

రాత్రికి విజేతను ప్రకటించే అవకాశం

ఎన్డీయే అభ్యర్థి సీపీ రాధాకృష్ణన్, ఇండియా కూటమి అభ్యర్థి జస్టిస్‌ సుదర్శన్‌రెడ్డిల మధ్య పోరు

మద్దతు ఇలా.. 

పార్లమెంటు ఉభయసభల సభ్యుల సంఖ్య 788 

ఏడు స్థానాలు ఖాళీ కావడం వల్ల ప్రస్తుతం 781 మందే 

పోలింగుకు దూరంగా బీఆర్‌ఎస్‌ (4 రాజ్యసభ), బీజేడీ(7) 

లెక్క ప్రకారం.. 386 ఓట్లు దక్కించుకున్నవారు విజేత

బలాబలాలు.. 

ఎన్డీయేకి 425 మంది సభ్యుల బలం.. ఇతరుల మద్దతు కలిపితే ఆ సంఖ్య 438కి మించే అవకాశం 

ఇండియా కూటమికి 314 మంది ఎంపీల మద్దతు ! 

ఏదైనా అద్భుతం జరిగితే తప్పా.. ఎన్డీయే అభ్యర్థి గెలుపు లాంఛనమే! 

బ్యాలెట్‌ ఓటింగ్‌

రహస్య బ్యాలెట్‌ విధానంలో ఉపరాష్ట్రపతి ఎన్నిక 

ప్రాధాన్య ఓట్లు వేసే పద్ధతి కావడం వల్ల బ్యాలెట్లనే వాడకం. ఈవీఎంలలో ఈ సదుపాయం లేదు.

తమ ప్రాధాన్యం ప్రకారం ఆయా అభ్యర్థులకు ఓట్లేయనున్న ఎంపీలు 

అభ్యర్థులిద్దరికీ సమానంగా ఓట్లువస్తే అప్పుడు మాత్రమే రెండో ప్రాధాన్య ఓట్లను పరిగణనలో తీసుకుంటారు.

నచ్చిన అభ్యర్థికే ఓటింగ్‌

తమ సభ్యులకు విప్‌ జారీచేయకూడదని పార్టీలకు ఎన్నికలసంఘం స్పష్టీకరణ. 

ఎంపీలు తమకు నచ్చిన అభ్యర్థికి ఓటేసే అవకాశం 

ప్రతిష్టాత్మకంగా తీసుకుని పోటాపోటీగా ప్రచారం చేసిన ఎన్డీయే, ఇండియా కూటమి అభ్యర్థులు 

గత రెండ్రోజులుగా ఎంపీలందర్నీ ఢిల్లీకి రప్పించి ఓటింగుకు సమాయత్తం చేసిన ఇరు కూటములు

ఇప్పటికే ముగిసిన నమూనా(మాక్‌) పోలింగ్‌ 

గతంలో.. ఫస్ట్‌ టైం.. 

2022 ఎన్నికల్లో ఉపరాష్ట్రపతి పదవికి ఎన్నిక 

ఓట్లేసిన 725 మంది ఎంపీలు 

ఎన్డీయే అభ్యర్థి జగదీప్‌ ధన్‌ఖడ్‌కు 528 (74.37%), ప్రతిపక్ష కాంగ్రెస్‌ అభ్యర్థి మార్గరెట్‌ ఆళ్వాకు 182 (25.63%) దక్కిన ఓట్లు 

15 ఓట్లు చెల్లలేదు. 55 మంది ఓటింగుకు గైర్హాజరు 

2025 ఉపరాష్ట్రపతి ఎన్నికల వేళ.. తగ్గిన ఎన్డీయే సంఖ్యాబలం 

Videos

ఎవరు పూల సుబ్బయ్య.. వెలిగొండకు ఆయన పేరు ఎందుకు!

నేపాల్‌లో యాక్షన్‌లోకి ప్రధాని బాలేంద్ర షా!

తుక్కుగూడలో దారుణం.. ఆ రోజు రాత్రి జరిగింది ఇదే పోలీస్ రిపోర్ట్ లో సంచలన విషయాలు

విజయవాడలో CPS ఉద్యోగుల భారీ ర్యాలీ

కర్నూలులో ఉగ్రవాది అరెస్ట్.. చిన్న తప్పుతో దొరికేశాడు

శివుడి త్రిశూలం నుంచి పుట్టిన దేశం, నేపాల్ అసలు కథ ఇదే!

బాబు,పవన్ లను ప్రశ్నిస్తే తప్పా..? గొంతు నొక్కే కుట్ర

పుష్ప శ్రీవాణిపై పోలీసుల ఓవరాక్షన్ చీర లాగి దురుసు ప్రవర్తన..

పాకిస్తాన్ వక్రబుద్ధి మరోసారి బట్టబయలు!

పోలీస్ స్టేషన్ లో ఆనంద్ సాయి కొడుకు సందీప్

Photos

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)

+5

తమిళ బ్యూటీ ఆండ్రియా పారిస్ ట్రిప్ (ఫొటోలు)

+5

హీరోగా రవితేజ తమ్ముడి కొడుకు.. 'మారెమ్మ' ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)