Breaking News

అమెరికా సాయం వివాదం..ఎవరీ వీణారెడ్డి..?

Published on Fri, 02/21/2025 - 08:55

న్యూఢిల్లీ:భారత్‌లో ఓటింగ్‌ శాతం పెంచేందుకు అమెరికా చేసిన సాయం ప్రస్తుతం వివాదాస్పదమవుతోంది. బీజేపీ,కాంగ్రెస్‌ పార్టీల మధ్య ఈ వివాదంపై విమర్శలు ప్రతి విమర్శలు కొనసాగుతున్నాయి. భారత్‌కు రూ. 186 కోట్ల ఓటర్‌ టర్నవుట్‌ సాయాన్ని నిలిపివేస్తున్నట్లు అమెరికా అధ్యక్షుడు ట్రంప్‌ ఇటీవలే  ప్రకటించిన విషయం తెలిసిందే.

భారత్‌లో ఏదో ఒక పార్టీకి ఎన్నికల్లో సాయం చేయడానికే బైడెన్‌ ఈ సాయం చేసి ఉంటారని ట్రంప్‌ వ్యాఖ్యానించడం కూడా సంచలనమైంది.అయితే ఈ వ్యవహారంలో తాజాగా వీణారెడ్డి తెరపైకి వచ్చింది. వీణారెడ్డి యూఎస్‌ ఏజెన్సీ ఫర్‌ ఇంటర్నేషనల్‌ డెవలప్‌మెంట్‌(యూఎస్‌ఎయిడ్‌)ఇండియాకు 2021-24 మధ్య డైరెక్టర్‌గా వ్యవహరించారు.

భారత్‌కు ఓటర్‌ టర్నవుట్‌ విషయంలో సాయం చేయడంలో వీణారెడ్డి కీలకంగా వ్యవహరించారన్న ప్రచారం జరుగుతోంది. ఈమె 2021లో భారత్‌కు వచ్చి 2024 లోక్‌సభ ఎన్నికలు ముగిసిన తర్వాత తిరిగి అమెరికా వెళ్లారు. వీణారెడ్డి పాత్రపై విచారణ జరపాలని బీజేపీ ఎంపీ మహేష్‌ జెఠ్మలానీ తాజాగా ట్వీట్‌ చేయడంతో ఆమె పేరు వెలుగులోకి వచ్చింది.

వీణారెడ్డి యూఎస్‌ఎయిడ్‌ డైరెక్టర్‌గా ఉన్నపుడు అమెరికా నుంచి భారత్‌కు అందే సాయం గణనీయంగా పెరిగినట్లు సమాచారం.అమెరికా సాయంతో భారత్‌లో ఓటర్‌ టర్నవుట్‌ పెరిగితే అది కచ్చితంగా అధికార పార్టీకి అయితే మేలు చేయదని బీజేపీ ఐటీ సెల్‌ చీఫ్‌ అమిత్‌ మాలవ్య ఇప్పటికే ఎక్స్‌(ట్విటర్‌)లో పోస్టు పెట్టడం గమనార్హం.

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)