Breaking News

పట్టాలెక్కనున్న ‘స్లీపర్‌ వందే భారత్‌’.. రూట్‌ ఇదే!

Published on Thu, 02/08/2024 - 09:57

వందే భారత్ ఎక్స్‌ప్రెస్ అనంతరం ‘స్లీపర్ వందే భారత్’ త్వరలో పట్టాలెక్కేందుకు సిద్ధమవుతోంది. దీని కోసం పలువురు ప్రయాణికులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. వందే భారత్ మాదిరిగానే  ‘స్లీపర్ వందే భారత్’ కూడా ప్రత్యేకమైన రైలుగా గుర్తింపు పొందనుంది. 

దేశంలోనే మొట్టమొదటి ‘స్లీపర్ వందే భారత్’ ఏ మార్గంలో నడుస్తుందో తెలుసుకోవాలని చాలామంది ఆసక్తి చూపిస్తున్నారు. దీనికి సంబంధించిన వివరాలను రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ వెల్లడించారు. ప్రస్తుతం 41 వందేభారత్ రైళ్లు నడుస్తున్నాయి. ఇందులో 39 రైళ్లు ట్రాక్‌పై నడుస్తుండగా, రెండు రైళ్లు రిజర్వ్‌లో ఉన్నాయి. ఈ వందే భారత్ ఎక్స్‌ప్రెస్‌లన్నీ చైర్ కార్ సౌకర్యం కలిగినవి. అంటే వీటిలో కూర్చుని ప్రయాణించవచ్చు. రాబోయే రోజుల్లో ‘వందే భారత్’ ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారనుంది. 

‘స్లీపర్ వందే భారత్’ రైళ్లలో మరింత సౌకర్యవంతమైన ఏర్పాట్లు ఉన్నాయి. వందే భారత్ స్లీపర్ రైళ్లు చాలా దూరం వరకూ ప్రయాణిస్తాయి. ఇవి రాత్రిపూట నడుస్తాయి. ఇందులో ప్రయాణికులు నిద్రిస్తూనే ప్రయాణం సాగించవచ్చు. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం దేశంలోని ప్రధాన మార్గాలైన ఢిల్లీ-హౌరా, ఢిల్లీ-ముంబై మధ్య మొదటి వందే భారత్ స్లీపర్ రైలును నడిపేందుకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ రూట్లలో సాధారణంగా ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని, వందే భారత్ ఎక్స్‌ప్రెస్ రైలును ఏకకాలంలో ఈ రెండు మార్గాల్లో నడపపనున్నారని తెలుస్తోంది. 

ఈ రెండు మార్గాలే కాకుండా, ఢిల్లీ-బెంగళూరు, ఢిల్లీ-చెన్నై, ఢిల్లీ-గౌహతి, ఢిల్లీ-భువనేశ్వర్, ఢిల్లీ-పాట్నా రూట్లలో 10 ‘స్లీపర్ వందే భారత్’ రైళ్లు నడవనున్నాయి. రైల్వే మంత్రిత్వ శాఖ తెలిపిన వివరాల ప్రకారం మొదటి స్లీపర్ వందే భారత్ రైలును ఐసీఎఫ్ చెన్నై తయారు చేయనుంది. దీని స్లీపర్ కోచ్ రాజధాని, ఇతర ప్రీమియం రైళ్లకు కొద్దిగా భిన్నంగా ఉంటుంది. ఇందులో ఒక్కో కోచ్‌లో నాలుగు టాయిలెట్లకు బదులుగా మూడు టాయిలెట్లు ఉంటాయి. దీనితో పాటు మినీ ప్యాంట్రీ కూడా ఉంటుంది. స్లీపర్ వందే భారత్ రైలులో మొత్తం 823 బెర్త్‌లు ఉంటాయి. ఇందులో ప్రయాణికులకు 823 బెర్త్‌లు, రైల్వే సిబ్బందికి 34 బెర్త్‌లు ఉంటాయి.

Videos

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

పోలీసుల ఓవర్ యాక్షన్.. కల్పలత రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్

ఒళ్లు దగ్గర పెట్టుకోండి..! బాబుపై చలసాని సీరియస్

కొండా సురేఖ దారెటు..!

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

Photos

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)