శారీరకంగా కలిశాక...జాతకాలు కలవలేదంటే.. ఎలా?

Published on Tue, 02/24/2026 - 22:41

పెళ్లి చేసుకుంటానని చెప్పి శారీరక సంబంధం ఏర్పరచుకున్న తర్వాత ’కుండలి’ (జాతకం) సరిపోలేదనే  కారణం చూపించి పెళ్లి నిరాకరించడం అంటే అనేది భారతీయ న్యాయ సంహిత(బిఎన్‌ఎస్‌)లోని సెక్షన్‌ 69 పరిధిలోకి వస్తుందని  అత్యున్నత న్యాయస్థానం వెల్లడించింది.  ఈ సెక్షన్‌ మోసపూరిత మార్గాల ద్వారా లైంగిక సంబంధం ఏర్పరచుకోవడాన్ని నేరంగా పరిగణిస్తుంది. ఒక మహిళను మోసం చేసిన మగవాడికి  బెయిల్‌ మంజూరు చేయడానికి నిరాకరిస్తూ, జస్టిస్‌ స్వర్ణ కాంత శర్మ ఈ మేరకు స్పష్టమైన వ్యాఖ్యలు చేశారు.

తమ వివాహానికి ఎటువంటి అడ్డంకులు లేవని నిందితుడు పదేపదే మహిళకు హామీ ఇవ్వడం ఆధారంగా శారీరక సంబంధాలు కొనసాగించాడని  తెలుస్తోంది.  అందువల్ల, ’జాతకం’  సరిపోకపోవడం అంటూ కారణం చూపడం అంటే అతని ప్రవర్తన బిఎన్‌ఎస్‌ సెక్షన్‌ 69 కింద నేరం అవుతుందని జస్టిస్‌ శర్మ వెల్లడించారు.

ఓ మహిళతో సంబంధం ఏర్పరచుకుని ఆ తర్వాత పెళ్లికి నిరాకరించాడనే ఫిర్యాదుతో గత జనవరి 4 నుంచి జ్యుడీషియల్‌ కస్టడీలో ఉన్న ఓ నిందితుడి బెయిల్‌ మంజూరు సమయంలో వాదోపవాదాల సందర్భంగా ఈ అంశం ప్రస్తావనకు వచ్చింది. తమ  సంబంధం ఏకాభిప్రాయంతో ఏర్పడిందని,  తామిద్దరూ ఎనిమిది సంవత్సరాలుగా ఒకరినొకరు తెలుసని నిందితుడు తరపు లాయర్‌ వాదించాడు.  ఈ కేసులో అత్యాచారం లాంటివేవీ జరుగనందున తమ క్లయింట్‌ రెగ్యులర్‌ బెయిల్‌ పొందడానికి అర్హుడని బెయిల్‌ ఇవ్వాలని ఆయన కోరాడు.

నిందితుడు తనను మోసం చేశాడని ఓ మహిళ మొదటి ఫిర్యాదును గత నవంబర్‌ లో దాఖలు చేసింది. అయితే  నిందితుడు అతని కుటుంబం ఇచ్చినట్లు చెబుతున్న వివాహ హామీ ఆధారంగా ఆ తర్వాత దానిని ఉపసంహరించుకుంది.  కానీ జాతకాలు  సరిపోలడం లేదనే కారణంతో వారు మరోసారి వివాహానికి నిరాకరించారు. దీంతో బాధితురాలు తిరిగి న్యాయస్థానాన్ని ఆశ్రయించింది.

ఈ సంఘటనల క్రమం చూస్తే ఇది ‘సంబంధం చెడిపోవడం‘ మాత్రమే కాదని, జాతకం కలవాలని అనుకున్నప్పటికీ. దరఖాస్తుదారుడు అతని కుటుంబం .. అంతకు ముందు పదేపదే వివాహ హామీలు ఇవ్వడం జరిగిందని కోర్టు అభిప్రాయపడింది. ‘సంబంధం విఫలమైనందున లేదా వివాహం కార్యరూపం దాల్చనందున క్రిమినల్‌ చట్టాన్ని అమలు చేయలేమనే ప్రతిపాదనలో ఎటువంటి వివాదం లేదు. అయితే, ఈ దశలో ప్రస్తుత కేసు వేరే ప్రాతిపదికన ఉంది‘ అని కోర్టు పేర్కొంది. ‘గతంలో  హామీ ఇచ్చినప్పటికీ జాతకాలు సరిపోలడం లేదనే కారణంతో వివాహం చేసుకోవడానికి నిరాకరించడం, , ప్రాథమికంగా దరఖాస్తుదారుడు ఇచ్చిన వాగ్దానంలోని వాస్తవికతపై ప్రశ్నను లేవనెత్తుతుంది. ఈ దశలో అలాంటి ప్రవర్తన బిఎన్‌ఎస్‌  సెక్షన్‌ 69 కింద నేరంగా పరిగణన పొందుతుంది అంటూ కోర్టు తేల్చింది.

Videos

స్థానిక ఎన్నికలపై ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

కడప YSRCP అభ్యర్థిపై టీడీపీ దాడి... మేయర్ అభ్యర్థి బండి దీప్తి స్ట్రాంగ్ వార్నింగ్

మిథున్ రెడ్డి పై టీడీపీ గూండాలు దాడి.. లోకేష్ కు తోపుదుర్తి మాస్ వార్నింగ్

టీమిండియాకు బిగ్ టెన్షన్! చివరి T20.. ఎవరిది సిరీస్?

మిథున్ రెడ్డి సీరియస్ వార్నింగ్.. దాడులకు భయపడేది లేదు..!

మాట ఇచ్చి మోసం.. జనసేన కు షాక్ ఇచ్చిన మహిళా నేత

బరితెగింపు అంటే ఇదే.. నామినేషన్ తొలి రోజే తెగబడ్డ నారా గొడ్డలి

YSRCP రెండో జాబితా.. మేయర్ అభ్యర్థులు వీరే..!

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

Photos

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)