Breaking News

ఉత్తరాఖండ్‌: రెస్క్యూ ఆపరేషన్‌కు ఎడతెగని ఆటంకాలు!

Published on Tue, 11/28/2023 - 07:39

ఉత్తరాఖండ్‌లోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులకు 17 రోజులు దాటుతున్నా విముక్తి లభించలేదు. వారిని చేరుకునేందుకు చేస్తున్న ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. మొదట డ్రిల్లింగ్ కోసం అమెరికా నుంచి తెచ్చిన యంత్రం చెడిపోయింది. ఇప్పుడు ప్రతికూల వాతావరణం కొత్త ఇబ్బందులను సృష్టిస్తోంది.

ఉత్తరకాశీలోని సిల్క్యారా సొరంగంలో చిక్కుకున్న 41 మంది కార్మికులను చేరుకోవడానికి అమెరికన్ ఆగర్ మెషిన్ చెడిపోవడంతో ప్రస్తుతం మాన్యువల్ డ్రిల్లింగ్ జరుగుతోంది. 86 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేయాల్సి ఉండగా,  ఇప్పటి వరకు 36 మీటర్ల మేరకు తవ్వగలిగారు. అమెరికా నుంచి తీసుకువచ్చిన డ్రిల్లింగ్ మిషన్ బ్లేడ్లు.. బాధిత కార్మికులున్న ప్రదేశానికి 12 మీటర్ల ముందుగానే విరిగిపోయాయి. ఫలితంగా రెస్క్యూ  ఆపరేషన్‌ను మధ్యలోనే ఆపివేసి, బ్లేడ్‌లను తొలగించాల్సివచ్చింది. 

ఉత్తరాఖండ్‌లో ప్రస్తుతం అధ్వాన్నంగా తయారైన వాతావరణం రెస్క్యూ  ఆపరేషన్‌కు కొత్త సమస్యలను సృష్టిస్తోంది. రాష్ట్రంలో రానున్న 24 గంటల్లో వర్షాలు, వడగళ్ల వాన కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. దీని వల్ల రెస్క్యూకు సమస్యలు తలెత్తవచ్చని అధికారులు భావిస్తున్నారు. సొరంగంలో కొనసాగుతున్న రెస్క్యూ ఆపరేషన్‌ను పరిశీలించేందుకు ప్రధాని మోదీ ప్రత్యేక కార్యదర్శి పీకే మిశ్రా, హోంశాఖ కార్యదర్శి అజయ్ కే భల్లా, ఉత్తరాఖండ్ చీఫ్ సెక్రటరీ ఎస్‌ఎస్ సంధు సంఘటనా స్థలానికి వచ్చారు.

సొరంగంలో వర్టికల్ డ్రిల్లింగ్ శరవేగంగా జరుగుతోందని రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ అదనపు కార్యదర్శి మహమూద్ అహ్మద్ తెలిపారు. ఇప్పటి వరకు 36 మీటర్ల వర్టికల్ డ్రిల్లింగ్ చేశారు. కార్మికులలో నిరాశానిస్పృహలు నెలకొన్న దృష్ట్యా, ఐదుగురు వైద్యుల బృందం సంఘటనా స్థలంలో  ఉంటోంది. వారు సొరంగంలో చిక్కుకున్న కార్మికులతో మాట్లాడుతూ వారికి భరోసా కల్పిస్తున్నారు.

సొరంగంలో చిక్కుకున్న కార్మికుల మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షిస్తున్నామని, వారు కుటుంబ సభ్యులతో మాట్లాడేలా చూస్తున్నామని నేషనల్ డిజాస్టర్ మేనేజ్‌మెంట్ అథారిటీ సభ్యుడు లెఫ్టినెంట్ జనరల్ (రిటైర్డ్) సయ్యద్ అతా హస్నైన్ తెలిపారు. మరోవైపు సొరంగంలో చిక్కుకున్న 41 మంది కూలీలు త్వరగా బయటకు రావాలని కాంక్షిస్తూ స్థానికులు సొరంగం దగ్గర హోమాలు నిర్వహిస్తున్నారు. 
ఇది కూడా చదవండి: ఢిల్లీలో భారీ వర్షం.. విమానాల రాకపోకలకు అంతరాయం!

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)