Breaking News

ఉత్తరాఖండ్‌లో చిక్కుకున్న యాత్రికులు

Published on Tue, 08/08/2023 - 10:07

డెహ్రాడూన్: ఉత్తరాఖండ్‌లో వర్షాలు బీభత్సాన్ని సృష్టిస్తున్నాయి. కొడియాల వద్ద 1500 వాహనాలు నిలిచిపోగా సుమారు 20 వేల మంది రోడ్ల మీద చిక్కుకుపోయారు. సుమారు 40 కి.మీ మేర యాత్రికులు, స్థానికులు గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు. 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఎడతెరపి లేకుండా కురుస్తున్న వానలకు అక్కడి ప్రజలు నానా అవస్థలు పడుతున్నారు. ఎక్కడికక్కడ కొండచరియలు విరిగిపడటంతో యాత్రికులు దారిపొడవునా ఆవస్థలు పడుతున్నారు. కొడియాల్ వద్ద 40 కి.మీ. మేర సుమారు 1500 వాహనాలు నిలిచిపోయాయి. అందులో కనీసం 20 వేల మంది జనం ఎటూ మరలలేక అక్కడే నిలిచిపోయారు. రిషికేష్ యాత్రికులు, స్థానికులు రోడ్డుపైనే గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.   

వీరిలో ఏపీ, బెంగుళూరుకు చెందిన వారు కూడా భారీ సంఖ్యలో ఉన్నారు. వీరంతా తిరుగు ప్రయాణంలో వెళ్తుండగా అక్కడ చిక్కుకున్నట్లు తెలిపారు. 

ఉత్తరాఖండ్ రాష్ట్రంలో ఈరోజు కూడా అక్కడక్కడా భారీ వర్షాలు పడతాయని మరో రెండు రోజుల పాటు ఇదే పరిస్థితి ఉంటుందని అక్కడి వాతావారణ శాఖ వెల్లడిస్తూ ఆరెంజ్ అలెర్ట్ ప్రకటించింది. ఈ నేపథ్యంలో మమ్మల్ని ఎలాగైనా బయట పడేయమని విపత్తులో చిక్కుకున్న  యాత్రికులంతా ప్రభుత్వాన్ని, సంబంధిత అధికారులని అభ్యర్థిస్తున్నారు. 

ఇది కూడా చదవండి: చెన్నైలో నిత్య పెళ్లికొడుకు కల్యాణసుందరం అరెస్ట్ 

Videos

ఉద్దవ్ సేన ఎమ్మెల్యేపై దిశా శాలియన్ తండ్రి సంచలన ఆరోపణలు

ఏంపొడిచారని పుట్టిన రోజు సెలబ్రేషన్ చేస్తున్నారు, పవన్ ను ఏకిపారేసిన పోతిన మహేష్

నేపాల్ లో సోనుసూద్.. వరద బాధితులకు అండగా రియల్ హీరో

వేటు పడుద్ది! KC వేణుగోపాల్ తో కొండా సురేఖ భేటీ

ఆపిల్ ల‌వ‌ర్స్‌కు గుడ్‌న్యూస్ ఐఫోన్ 18..కొత్త డేట్ ప్రీ బుకింగ్ ఆర్డ‌ర్ చేసుకోండి

భయపడకండి మీకు నేనున్నా... అంబటి సురేష్ కుటుంబానికి ధైర్యం చెప్పిన జగన్

థియేటర్స్ దందాకు చెక్ Seat వద్దకే ఫుడ్ డెలివరీ..

నేపాల్ నీళ్ల పాలు.. ఊళ్లను ఊడ్చేసిన వరదలు

సర్కార్ పై గులాబీ సమరం

బాబు.. సిద్ధంగా ఉండు.. జగన్ గెలుపు ఖాయం..

Photos

+5

'బెత్లెహెమ్ కుటుంబ యూనిట్' సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్ (ఫొటోలు)

+5

అమ్మ చేతి వంట.. వేపపుల్లతో బ్రషింగ్.. షాకిచ్చిన శోభిత (ఫొటోలు)

+5

నాన్న జ్ఞాపకాల్లో వైఎస్‌ జగన్‌.. వైఎస్సార్‌ ఘాట్‌ వద్ద నివాళి (ఫొటోలు)

+5

నేపాల్ పిల్లలకు అండగా సోనూసూద్ (ఫొటోలు)

+5

ఇలా మెరిసిపోతే ఎలా కాయదు? (ఫొటోలు)

+5

హైదరాబాద్ లో ఆకాశ వంతెన (స్కైవాక్)...ఎక్కడో తెలుసా? (ఫొటోలు)

+5

పులివెందుల : భాకరాపురం క్యాంప్‌ కార్యాలయంలో వైఎస్‌ జగన్‌ ప్రజాదర్బార్‌ (ఫొటోలు)

+5

‘మిర్జాపూర్‌ : ది మూవీ’ తెలుగు ప్రెస్‌మీట్‌ (ఫొటోలు)

+5

ట్రేడిషనల్ శారీలో బిగ్‌బాస్‌ బ్యూటీ ఆర్జే కాజల్.. ఫోటోలు

+5

మెరుపుతీగలా మారిపోయిన హెబ్బా పటేల్ (ఫొటోలు)