Breaking News

మహ్మద్‌ దీపక్‌తో రాహుల్‌ గాంధీ భేటీ, ఫోటోలు వైరల్‌

Published on Mon, 02/23/2026 - 16:48

ఉత్తరాఖండ్‌లో గుంపునుంచి 70 ఏళ్ల ముస్లిం దుకాణదారుడిని కాపాడి సంచలనంగా మారిన దీపక్ కుమార్‌ను లోక్‌సభ ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీని సోమవారం కలిశారు. త్వరలో తన జిమ్‌కు వెళ్తానని రాహుల్‌ దీపక్‌కు  హామీ ఇచ్చారు. దీనికి సంబంధించిన నెట్టింట ఆసక్తికరంగా మారాయి.

ఉత్తరాఖండ్‌ కోట్ద్వార్ పట్టణంలో ఇటీవల ఒక ముస్లిం వ్యాపారిని బజరంగ్ దళ్ కార్యకర్తలు బెదిరిస్తున్న సమయంలో, ఆ వ్యాపారిని రక్షించిన  దాదాపు నెల రోజుల తర్వాత ఈ సంఘటన చోటు చేసుకుంది. 

రాహుల్ గాంధీ , సోనియా గాంధీలను కలిసిన తర్వాత విలేకరులతో  దీపక్ మాట్లాడుతూ, “రాహుల్ జీ ఫోన్ చేసి, తన కుటుంబంతోమాట్లాడారు. ఏం జరిగినా దాని గురించి చింతించ వద్దని చెప్పారనిగుర్తు చేసుకున్నారు. తాను ఏ తప్పు చేయలేదని ,చేసింది మంచిదేనని రాహుల్‌ చెప్పారన్నారు.  కోట్ద్వార్‌ను సందర్శించి తన జిమ్‌లో సభ్యత్వం తీసుకుంటానని చెప్పారనీ, రాహుల్ జీ  జిమ్‌ సభ్యత్వం తీసుకుని వర్కౌట్స్‌ చేస్తే చాలా సంతోషిస్తానని కూడా చెప్పారు. ఇంతకు ముందు తనకు వస్తున్న బెదిరింపులు ఆగిపోయాయని కూడా దీపక్ అన్నారు.

 ఈ ఏడాది  జనవరి 26న, 38 ఏళ్ల దీపక్, పార్కిన్సన్స్ వ్యాధి ఉన్న ముస్లిం దుకాణదారుడిని వేధిస్తున్న వ్యక్తుల గుంపును ఎదిరించి వకీల్ అహ్మద్ దుకాణాన్ని రక్షించిన సంగతి తెలిసిందే. ఈ సందర్బంగా  భజరంగ్ దళ్ కార్యకర్తలుపేరు అడిగినపుడు‘‘మహ్మద్ దీపక్’’ అని చెప్పి సోషల్ మీడియాలో వైరల్‌గా మారాడు.కాగా వకీల్ అహ్మద్ తన షాపు పేరు ‘‘బాబా స్కూల్ డ్రెస్’’గా పెట్టుకోవడంపై బజరంగ్ దళ అభ్యంతరం వ్యక్తం చేసింది. ఈ సంఘటన తర్వాత, దీపక్ నిర్వహిస్తున్న హల్క్ జిమ్‌లో సభ్యత్వ సంఖ్య 150 నుండి 15కి పడిపోయింది. జిమ్ నిర్వాహకుడిగా ఉన్న దీపక్  ఆ తరువాత కొన్ని ఇబ్బందుల నెదుర్కున్నాడు. అయితే ‘‘ఇండియా హీరో’’ అంటూ దీపక్‌పై రాహుల్ గాంధీ ప్రశంసలు కురిపించారు. అలాగే సీపీఎం రాజ్యసభ సభ్యుడు జాన్ బ్రిట్టాస్  మెంబర్ షిప్‌ తీసుకున్నారు.

 

 

Videos

బాబు తప్పుడు సమాచారంపై వైఎస్ జగన్ ఫైర్

గోల్డ్ కొనేవారికి షాక్..! భారీగా పెరిగిన ధరలు

కృష్ణుడిగా విజయ్ దేవరకొండ..?

భలే పడ్డారు.. సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న వీడియో

రోడ్డుపై స్కూటర్ ఆపి.. హెల్మెట్ తో దాడి..! మాజీ ఎమ్మెల్యే రౌడీయిజం వైరల్

ప్లాన్ "B" లోడింగ్..! కొండా సురేఖ సంచలన పోస్ట్

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు