Breaking News

Hit and Run: కారు బీభత్సం.. నలుగురు మృతి

Published on Thu, 03/13/2025 - 07:10

డెహ్రాడూన్‌: ఉత్తరాఖండ్‌లో ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ హృదయవిదారక ఘటన స్థానికులకు కలచివేసింది. కారు డ్రైవర్‌ నిర్లక్ష్యానికి నాలుగు నిండు ప్రాణాలు బలైపోయాయి. ఈ ‍ప్రమాదంలో తీవ్రంగా గాయపడినవారు ప్రస్తుతం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు.

డెహ్రాడూన్‌(Dehradun)లోని ముస్సోరీ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది.  అతి వేగంగా వస్తున్న లగ్జరీ కారు రోడ్డు పక్కగా నడుస్తున్న ఆరుగురు పాదచారులను వేగంగా ఢీకొంది. దీంతో వీరిలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. ఈ దుర్ఘటనలో మరో ఇద్దరు  తీవ్రంగా గాయపడ్డారు. ఈ ప్రమాదం దరిమిలా కారు డ్రైవర్‌ కారుతో సహా అక్కడి నుంచి పరారయ్యాడు. ఎస్ఎస్పీతో సహా ఇతర అధికారులు  సంఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు ముమ్మరం చేశారు.

చండీగఢ్ రిజిస్ట్రేషన్ నంబర్(Chandigarh registration number) కలిగిన మెర్సిడెస్ కారును నడుపుతున్న డ్రైవర్ అత్యంత నిర్లక్ష్యంగా వాహనాన్ని  నడుపుతూ, రోడ్డుపై వెళుతున్న నలుగురు కార్మికులను, ఒక స్కూటర్‌ను ఢీకొన్నాడు. ఈ ఘటనలో నలుగురు కార్మికులు అక్కడికక్కడే మృతిచెందగా, స్కూటర్‌పై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. పోస్టుమార్టం కోసం నాలుగు మృతదేహాలను పోలీసులు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఇద్దరు క్షతగాత్రులను డూన్ ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. కారును నడిపిన వ్యక్తి ఆచూకీ తెలుసుకునేందుకు పోలీసులు కంట్రోల్ రూమ్ ద్వారా అన్ని పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. 

ఇది కూడా చదవండి: ఉక్రెయిన్‌కు మళ్లీ అమెరికా ఆయుధాలు

Videos

చంద్రబబు డైవర్షన్ పాలిటిక్స్ పై.. పుత్తా శివశంకర్ స్ట్రాంగ్ కౌంటర్

చెవిరెడ్డి పరామర్శ

ప్రజలకు ప్రభుత్వం భారీ శుభవార్త.. తగ్గనున్న బియ్యం ధరలు..?

Ambati : అది ఆయన పర్సనల్.. నేను చెప్పాలనుకున్నది ఒక్కటే!

కళ్యాణదుర్గంలో YSRCP భారీ ర్యాలీ

MPP పదవి కోసం YSRCP MPTC పట్టాభిరామిరెడ్డి కిడ్నాప్

SBI సూపర్ స్కీమ్ ప్రతి నెలా రూ.60,000

బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్న గాడ్జిల్లా! ఓవర్సీస్ లో రామాయణ కు గట్టి పోటీ

YSRCP ఎమ్మెల్సీల పిటిషన్లపై నేడు హై కోర్ట్ లో విచారణ

Alert: హైదరాబాద్ కు నీటి గండం.. డిసెంబర్ నుంచి తీవ్ర కష్టాలు..

Photos

+5

కుటుంబంతో కలిసి న‌భా న‌టేష్ దీపావ‌ళి సెలబ్రేషన్స్ (ఫోటోలు)

+5

ఇంట్లోనే చాలా సింపుల్‌గా శ్రీలీల సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

దీపావళి స్పెషల్.. అక్కినేని కుటుంబమంతా ఒకేచోట (ఫొటోలు)

+5

అల్లు ఫ్యామిలీ దీపావళి సెలబ్రేషన్ (ఫొటోలు)

+5

#Diwali2026 స్పెషల్ ఫొటోలు షేర్ చేసిన కృతి శెట్టి..(ఫోటోలు)

+5

ప్రమాదకర స్థాయికి వాయు కాలుష్యం...ఢిల్లీ ఉక్కిరి బిక్కిరి (ఫోటోలు)

+5

‘ఇట్లు అర్జున’ సినిమా మ్యూజికల్‌ లైవ్‌ కన్సర్ట్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

ఖైరతాబాద్‌లో ఘనంగా సదర్ ఉత్సవాలు (ఫోటోలు)

+5

రకుల్‌ ప్రీత్‌ సింగ్‌ స్టన్నింగ్‌ ఫోటోలు

+5

దివాళీ వేళ మెరిసిన తారలు (ఫోటోలు)