Breaking News

ది కేరళ స్టోరీ: యోగి సర్కార్‌ కీలక నిర్ణయం

Published on Tue, 05/09/2023 - 12:33

ది కేరళ స్టోరీ వివాదం ఇప్పట్లో చల్లారేలా లేదు.. విడుదలకు ముందే రాజకీయ రంగు పులుముకున్న ఈ వివాదం.. రోజులు గడుస్తున్న కొద్దీ తీవ్రతరమవుతోంది. వివిధ పార్టీలు. ప్రభుత్వాల మధ్య చిచ్చు రాజేస్తోంది. ఈ సినిమాను కేరళ ప్రభుత్వం సహా కాంగ్రెస్‌, విపక్షాలు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాయి. కేరళను కించపరిచేలా, ప్రజల్లో విద్వేషాలు రెచ్చగొట్టేలా రూపొందించారంటూ నిరసనలు వ్యక్తంచేస్తున్నాయి.

ఇప్పటికే రాష్ట్రంలో సినిమాను విడుదల చేస్తే అల్లర్లు జరిగే ప్రమాదం ఉందని తమిళనాడులోని మల్టిప్లెక్స్‌ థియేటర్లలో కేరళ స్టోరీ షోలను రద్దు చేశారు. మరోవైపు సమాజంలో అశాంతి. అలజడులను సృష్టించే అవకాశం ఉందని పశ్చిమ బెంగాల్‌లోని కేరళ స్టోరీని నిషేధిస్తున్నట్లు మమతా బెనర్జీ సోమవారం ప్రకటించారు. ఈ చిత్రాన్ని ఎక్కడైనా ప్రదర్శిస్తున్నట్లు తేలితే కఠిన చర్యలుంటాయని చెప్పారు.
చదవండి: ‘ది కేరళ స్టోరీ’కి భారీ షాక్‌.. 

అయితే వివాదాస్పద ది కేరళ స్టోరి సినిమాకు బీజేపీ మాత్రం మద్దతు తెలుపుతోంది. బీజేపీ పాలిత ప్రాంత రాష్ట్రాల్లో కేరళ స్టోరీకి పన్ను మినహాయింపులు కూడా ప్రకటిస్తున్నాయి. ఇప్పటికే మధ్యప్రదేశ్  సినిమాకు టాక్స్ ఫ్రీ కల్పించగా... తాజాగా ఈ జాబితాలోకి ఉత్తర ప్రదేశ్‌ సైతం చేరింది. 'ది కేరళ స్టోరీ'ని ఉత్తరప్రదేశ్‌లో పన్ను రహితంగా ప్రకటిస్తున్నట్లు ముఖ్యమంత్రి ఆదిత్యనాథ్ ట్వీట్ చేశారు. సీఎం తన క్యాబినెట్‌తో కలిసి ప్రత్యేక స్క్రీనింగ్‌లో సినిమాను వీక్షించే అవకాశం ఉంది.

ఇప్పటికే ప్రధాన మంత్రి మోదీ, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా సినిమాను చూశారు. ఉగ్రవాద ప్రమాదకర కుట్రను ఈ చిత్రం బహిర్గతం చేస్తుందని పేర్కొన్నారు. సినిమాను వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్‌పై విమర్శలు గుప్పించిన ఆయన.. ప్రతిపక్ష పార్టీ ఓటు బ్యాంకు కోసం ఉగ్రవాదాన్ని కప్పి ఉంచిందని మండిపడ్డారు. ది కేరళ స్టోరీ' ఏ రాష్ట్రం లేదా మతానికి సంబంధించినది కాదని జేపీ నడ్డా పేర్కొన్నారు.

కాగా సుదీప్తోసేన్‌ దర్శకత్వం వహించిన ఈ సినిమాను విపుల్‌ అమృత్‌లాల్‌ నిర్మించారు. ఆదా శర్మ,  యోగితా బిహానీ, సోనియా బలానీ, సిద్ధి ఇద్నాని ప్రధాన పాత్రలో నటించారు. కేరళలో తప్పిపోయిన 32 వేల మంది యువతలు ఏమయ్యారు, ఎక్కడున్నారనే ఇతివృత్తంతో  తెరకెక్కించారు. కేరళలో తప్పిపోయిన నలుగురు అమ్మాయిలు ఉగ్రసంస్థ ఐఎస్ఐలో చేరి శిక్షణ పొంది పొంది తమ మాతృభూమిపైనే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉగ్రవాద కార్యకలాపాలు చేపట్టిన్నట్లు చూపించడంతో వివాదాలకు దారి తీసింది. 

Videos

మమ్మల్ని కుక్కలకన్నా హీనంగా చూస్తున్నారు అన్న... తాటిపర్తి ముందు వెలిగొండ నిర్వాసితులు కన్నీరు

మీరు ఏమైనా అనుకోండి జనసేన ఒక చెత్త పార్టీ..! జనసేన నాయకుల భార్యలే మనుసులా

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్.. బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

పోలవరం అంటే గుర్తొచ్చేది YSR... బాబు క్రెడిట్ చోరీపై ఉండవల్లి సెటైర్లు

తెలంగాణ క్యాబినెట్ లో భారీ మార్పులు.. నెక్స్ట్ టార్గెట్ వాళ్లేనా..?

ఏపీ పోలీసులపై హైకోర్టు ఆగ్రహం

రేవంత్ బ్లాక్ మెయిల్... ఢిల్లీలో జరిగింది ఇదేనా..? కొండా సురేఖపై కుట్ర నిజమేనా..?

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)