Breaking News

బైక్‌ను ఈడ్చుకెళ్లిన ట్రైన్‌.. ఐదుగురు దుర్మరణం

Published on Wed, 12/24/2025 - 22:33

లక్నో: ఉత్తరప్రదేశ్‌  షాహజహాన్‌పూర్‌లో విషాదం చోటు చేసుకుంది. బుధవారం సాయంత్రం ఒకే బైక్‌పై ప్రయాణిస్తున్న ఒకే కుటుంబానికి చెందిన ఐదుగురిని రైలు ఢీకొట్టడ్డంతో మృతులు అక్కడికక్కడే మరణించారు.

ప్రమాదంపై రైల్వే పోలీసుల వివరాల మేరకు.. ప్రమాదం రోసా పోలీస్ స్టేషన్ పరిధిలోని అట్సలియా రైల్వే క్రాసింగ్ వద్ద సాయంత్రం 6:30 గంటలకు జరిగింది. బైక్‌పై ప్రయాణిస్తున్న ఐదుగురు ట్రాక్ దాటుతుండగా..బరేలీ నుండి లక్నో వెళ్తున్న సహర్సా గరీబ్ రథ్ ఎక్స్‌ప్రెస్ వారిని ఢీకొట్టింది. ఢీకొన్న వెంటనే బైక్ రైలులో ఇరుక్కుపోయి సుమారు 500 మీటర్ల దూరం ఈడ్చుకెళ్లింది.

మృతులు ఖేరీ జిల్లా ఉచోలియా పోలీస్ స్టేషన్ పరిధిలోని బంగావాన్ గ్రామానికి చెందినట్లు పోలీసులు గుర్తించారు.మృతుల్లో ముగ్గురు పెద్దలు,ఇద్దరు పిల్లలు ఉన్నట్లు నిర్ధారించారు. వీరంతా నగరంలోని బుధవారం మార్కెట్ నుండి సరుకులు కొనుగోలు చేసి తిరిగి వస్తున్నారు.

జీఆర్‌పీ ఎస్‌హెచ్‌ఓ మదన్‌పాల్ తెలిపిన ప్రకారం, ఐదుగురు అక్కడికక్కడే మృతి చెందారు.  లోకో పైలట్ అత్యవసర బ్రేకులు వేసి రైలును ఆపాడు.  రైలు సుమారు అరగంట పాటు అక్కడే నిలిచింది. మృతదేహాలను పోస్టుమార్టం కోసం ఆసుపత్రికి తరలించారు.

గ్రామస్థులు ఈ ఘటనపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. రైల్వే క్రాసింగ్ వద్ద భద్రతా చర్యలు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి ప్రమాదాలు పునరావృతం కాకుండా అండర్‌పాస్ లేదా ఓవర్‌బ్రిడ్జ్ నిర్మించాలని డిమాండ్ చేశారు.

Videos

24 క్యారెట్ గోల్డ్ కు LOAN ఎందుకు ఇవ్వరు? అసలు కారణం ఇదే

బాహుబలి, RRR రికార్డ్స్ పై కన్నేసిన ఇరుముడి..

నేపాల్ లో మృత్యుఘోష..! 1300కు చేరువలో మృతులు

కడప TDPలో మేయర్ పీఠం కోసం వార్..

మంటల్లో కాలిపోయిన ప్రైవేట్ బస్సు..!

వైరల్ అవుతున్న కొండా మురళీ ట్వీట్

ఇస్రో మరో ఘన విజయం.. GSLV-F07 రాకెట్ ప్రయోగం సక్సెస్..!

ప్రజలకు శ్రీకృష్ణాష్టమి శుభాకాంక్షలు తెలిపిన YS జగన్

బిడ్డ వ్యాఖ్యలను సురేఖ ఖండించాలి.. కానీ ఆమె ఆ పని చేయలేదు

అడ్డంగా బుక్కైన లోకేష్ ..! అర్హత ఉన్న స్వాతికి నో జాబ్.. టెట్ లో ఫెయిల్ వ్యక్తికి టీచర్ జాబ్?

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు