Breaking News

కానిస్టేబుల్‌ భార్య ఆత్మహత్య.. కారణం ఇదే..

Published on Mon, 07/28/2025 - 07:53

లక్నో: ప్రేమ పెళ్లి ఆమె పాలిట శాపమైంది. ఒక పోలీసు అధికారి భార్య.. భర్త ఇంట్లో వేధింపులు భరించలేక తనువు చాలించింది. సెల్ఫీ వీడియో తీసుకుంటూ లైవ్‌లో ఆత్మహత్య చేసుకుంది. ఈ షాకింగ్‌ ఘటన ఉత్తరప్రదేశ్‌లో చోటుచేసుకుంది. ఈ ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు.

వివరాల ప్రకారం.. యూపీ రాజధాని లక్నోలోని బక్షి కా తలాబ్ (బికెటి) పోలీస్ స్టేషన్‌లో కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న అనురాగ్ సింగ్, మృతురాలు సౌమ్య కశ్యప్ నాలుగు నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. అయితే, వివాహం జరిగిన నాటి నుంచే సౌమ్యకు భర్త, అత్తింటి వారి నుంచి వేధింపులు మొదలయ్యాయి. సౌమ్య కట్నం తీసుకురాక పోవడంతో అనురాగ్ కుటుంబం కట్నం గురించి ఇబ్బందులకు గురిచేసేవారని బాధితురాలు వీడియోలో తెలిపింది. కుటుంబ సభ్యుల ఒత్తిడితో, అనురాగ్ ఆమెను వేరే వివాహం చేసుకోవాలని కూడా బలవంతం చేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేసింది.

ఇది మాత్రమే కాదు, అనురాగ్ తరచుగా తనను కొట్టేవాడని ఆరోపించింది. ఈ మేరకు సౌమ్య ఇన్‌స్టాగ్రామ్‌లో ఒక భావోద్వేగ వీడియోను పోస్ట్ చేసింది. అయితే, అత్తింటి వేధింపులు, భర్త కూడా వారికి సపోర్టుగా మారడంతో సౌమ్య మానసికంగా కుంగిపోయింది. తనను మానసికంగా వేధించారని, తన భర్త, ఆయన బావ, బావ సోదరుడు కూడా తనను వేధిస్తున్నారని చెప్పుకొచ్చింది. నా భర్త బావ సంజయ్ పోలీస్‌ డిపార్ట​్‌మెంట్‌లో పనిచేస్తున్నాడు. అతని సోదరులలో ఒకరైన రంజిత్ న్యాయవాది. వీరి వద్ద డబ్బు ఉంది, డబ్బుతో వారు ఏదైనా చేయగలరు. వారు నన్ను ఎంతగానో హింసించారు. ఈరోజు నేను చనిపోతున్నానంటే వీరే కారణం అంటూ ఆత్మహత్యకు పాల్పడింది. అనంతరం, ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)