Breaking News

నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి.. దంపతుల ఆత్మహత్య

Published on Wed, 08/27/2025 - 16:15

ఉత్తరప్రదేశ్‌లోని షాజహాన్‌పూర్‌లో విషాదం జరిగింది. అప్పుల బాధ తాళలేక ఒక దంపతులు.. తమ నాలుగు నెలల కుమారుడికి విషమిచ్చి ఆత్మహత్య చేసుకున్నారు. సంఘటనా స్థలంలో సూసైడ్ నోట్‌ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. హ్యాండ్లూమ్ వ్యాపారవేత్త సచిన్ గ్రోవర్ (30).. ఆయన భార్య శివాని (28) తమ నాలుగు నెలల కుమారుడు ఫతేహ్‌.. ఇంటి రెండో అంతస్తులో నివాసం ఉంటున్నారు.

బుధవారం ఉదయం ఇంట్లో నుంచి ఎవరూ బయటకు రాకపోవడంతో పొరుగువారికి అనుమానం వచ్చి.. కిటికీ గుండా చూసేసరికి, గదిలోని ఉరికి వేలాడుతూ భార్యాభర్తల మృతదేహాలు కనిపించాయి. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని తలుపు పగలగొట్టి లోపలికి వెళ్లారు. కుమారుడు మంచంపై అపస్మారక స్థితిలో పడి ఉండగా.. భార్యాభర్తల మృతదేహాలు వేర్వేరు గదుల్లో ఉరికి వేలాడుతూ కనిపించాయి.

సూసైడ్‌ నోట్‌లో తమకున్న అప్పులు తీర్చడానికి తమ కారు, ఇల్లు అమ్మివేయాలని సచిన్‌ కోరారు. “నా కుటుంబంపై నాకు ఎలాంటి ఫిర్యాదుల్లేవు. వారు నన్ను పూర్తిగా మద్దతు ఇచ్చారు. దయచేసి మా కారు, ఇల్లు అమ్మి అప్పులు తీర్చండి.. తద్వారా ఎవరు మా అప్పులు చెల్లించలేదని చెప్పకుండా ఉండాలి.” అంటూ సచిన్ తన సూసైడ్ నోట్‌లో రాశారు.  సచిన్.. మంగళవారం సాయంత్రం తన తల్లితో మాట్లాడినప్పుడు.. రూ. 5 లక్షలు బ్యాంకు లోన్‌ కట్టాల్సి ఉందని.. కానీ రూ. 3 లక్షలు మాత్రమే సమకూర్చగలిగానని చెప్పాడని ఆయన తల్లి పేర్కొంది.

ఈ ఆర్థిక ఒత్తిడి కారణంగా వారు తీవ్ర మానసిక ఒత్తిడితోనే ఆత్మహత్యకు పాల్పడ్డారని పోలీసులు వెల్లడించారు. మంగళవారం రాత్రి, దంపతులు ఫ్యాన్‌కు ఉరేసుకుని చనిపోయారని.. వారి కుమారుడిని ముందుగా విషం ఇచ్చి చంపినట్లు పోలీసులు ప్రాథమికంగా నిర్థారించారు.

 

Videos

నామినేషన్ వేయనియ్యకుండా.. టీడీపీ నేతల అరాచకం.. చోద్యం చూస్తున్న పోలీసులు..

AK-47తో YSRCP నేతలపై కాల్పులు... YS అవినాష్ రెడ్డి స్ట్రాంగ్ వార్నింగ్..!

అమెరికాలో మహా ప్రళయం.. ఒకేసారి 3 రాకాసి తుఫానులు!

బన్నీ - జూ ఎన్టీఆర్ మల్టీస్టారర్.. నెల్సన్ మాస్టర్ ప్లాన్...

కడపలో ఉద్రిక్తత.. కార్పొరేటర్ అభ్యర్థులపై కత్తి పోట్లు.. బండి దీప్తి ఇంటిపై దాడి!

పులివెందులలో కాల్పులు.. YSRCP నేతలపై పోలీసుల దాష్టీకం

MP గురుమూర్తి చేతిలో నుంచి నామినేషన్ పేపర్స్ లాక్కొని పారిపోయిన టీడీపీ నేతలు

నూజివీడులో బాబుకు బిగ్ షాక్.. YSRCPలో చేరిన TDP కుటుంబాలు

బంగారం ధరల్లో బిగ్ ట్విస్ట్! నేడు తులం ఎంతంటే?

ఓటీటీలో ట్రెండ్ అవుతోన్న రొమాంటిక్ థ్రిల్లర్..

Photos

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)

+5

బర్త్‌డే స్పెషల్‌.. కీర్తి ఫొటోలు వైరల్‌

+5

కరీంనగర్ జిల్లాలో ఘనంగా బతుకమ్మ వేడుకలు (ఫొటోలు)

+5

‘రణబాలి’ మూవీ సక్సెస్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)