Breaking News

Sri Rama Navami: అయోధ్యకు ఐదు లక్షల మంది భక్తులు.. భద్రత కట్టుదిట్టం

Published on Sun, 04/06/2025 - 12:03

అయోధ్య: నేడు (ఆదివారం) దేశవ్యాప్తంగా శ్రీరామనవమి ఉత్సవాలు(Sri Ramanavami celebrations) అత్యంత వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఆలయాలన్నీ భక్తుల సందడితో కళకళలాడుతున్నాయి. శ్రీరాముడు జన్మించిన యూపీలోని అయోద్యలో అత్యంత వైభవంగా శ్రీరామనవమి ఉత్సవాలు జరుగుతున్నాయి. శ్రీరామదర్బారుకు ఈ రోజు ఉదయానికే ఐదు లక్షల మంది భక్తులు చేరుకున్నారు.

శ్రీరామనవమి సందర్భంగా అయోధ్యలోని బాలక్‌ రాముణ్ణి దర్శించుకునే వేళలను పొడిగించారు. ఈరోజు బాలరాముడు భక్తులకు 18 గంటలపాటు దర్శనమివ్వనున్నాడు. ఉదయం 5 గంటలకు తెరుచుకున్న ఆలయ తలుపులు రాత్రి 11 గంటల వరకూ తెరచివుంచనున్నారు. వీవీఐపీ దర్శనాలను(VVIP visits) కూడా నిలిపివేశారు. ఈరోజు మధ్యాహ్నం 12 గంటలకు సూర్య వంశస్థుడైన శ్రీరామునికి సూర్య భగవానుడు స్వయంగా తిలకం దిద్దనున్నాడు. (ఆ సమయంలో సూర్య కిరణాలు శ్రీరాములవారి నుదుటను తాకనున్నాయి)

ఈ  అద్భుత దృశ్యాన్ని చూసేందుకు భక్తులు తండోపతండాలుగా తరలివస్తున్నారు. ఈ నేపధ్యంలో ఆలయ ట్రస్ట్‌ ప్రత్యేక ఏర్పాట్లు చేసింది. అయోధ్యలోని సుమారు ఎనిమిది వేల ఆలయాలు, మఠాలను శ్రీరామనవమి సందర్భంగా అందంగా తీర్చి దిద్దారు. రామనగరి అయోధ్యలో ఈరోజు సాయంత్రం సరయూ తీరంలో రెండున్నర లక్షల దీపాలను వెలిగించనున్నారు.

ఇది కూడా చదవండి: Sri Rama Navami: బెంగాల్‌ నుంచి ముంబై వరకూ.. హై అలర్ట్‌

Videos

ఎన్ని కుట్రలు చేసినా నామినేషన్లు వేసి తీరుతాం

బీహార్ తలదించుకునేలా ఏపీ లో రెడ్ బుక్ అరాచకాలు

లోకేష్ ఈ రోజుని గుర్తు పెట్టుకుంటున్నాం... మిథున్ రెడ్డి, భూమన మాస్ వార్నింగ్

BIGG BOSS లీక్స్.. ఈ వీక్ CAPTAIN అతనే..?

షాకిస్తోన్న జైలర్ 2... రజనీ రెమ్యునరేషన్ తో 4 సినిమాలు..!

విజయనగరం జిల్లాలో టీడీపీ నాయకుల రాజీనామా

టీడీపీ గూండాలు దాడి చేసినా... వీల్ చైర్ లో కూర్చోబెట్టి కేతిరెడ్డి ర్యాలీ

శ్రీ సత్యసాయి జిల్లాలో తీవ్ర విషాదం, ఈతకెళ్లి ఐదుగురు మహిళలు మృతి

కడుపులో పాము.. ఉలిక్కిపడ్డ డాక్టర్లు..! ఎలా వెళ్లిందో తెలిస్తే ఎప్పటికీ ఆ పని చేయరు...!

YSRCP లో చేరిన జనసేన కీలక నేత గూడూరు వెంకటేశ్వరులు

Photos

+5

'ఇట్లు అర్జున'కి అండగా కింగ్ నాగార్జున (ఫొటోలు)

+5

ఇంట్లో అమ్మవారి పూజ చేసిన డైరెక్టర్ మారుతి (ఫొటోలు)

+5

తమిళనాడులోని దేవాలయాలన్నీ తిరిగేస్తున్న సింగర్ సునీత (ఫొటోలు)

+5

'సలార్' పృథ్వీరాజ్ బర్త్ డే.. లవ్లీ ఫొటోలు షేర్ చేసిన భార్య

+5

'జైలర్ 2' కటానా గర్ల్.. ఫొటోలు షేర్ చేసిన నటి

+5

'రామాయణ' కొత్త ట్రైలర్ లాంచ్ (ఫొటోలు)

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)