Breaking News

నేను అమెరికా డైట్‌ మాత్రమే తింటా

Published on Thu, 07/09/2026 - 01:17

న్యూఢిల్లీ: జైలు గదిలోకి వెళ్లాక చిప్పకూడు తప్పదు అని పెద్దలంటారు. కానీ అగ్రరాజ్యంలో పుట్టి పలు దేశాల్లో సాయుధ ముఠాలకు శిక్షణనిచ్చిన సైనిక నిపుణుడు, భారత్‌లో అక్రమంగా చొరబడి సాయుధ ముఠాలకు డ్రోన్లను ఆపరేట్‌ చేయడంలో శిక్షణ ఇచ్చేందుకు తెగించిన మాథ్యూ ఆరోన్‌ వ్యాన్‌ డైక్‌ మాత్రం తనకు అమెరికా డైట్‌ మాత్రమే కావాలని మొండిపట్టుపట్టాడు. 

నిరాహార దీక్ష చేస్తూ గత 50 రోజులుగా కేవలం సోయామిల్క్‌ మాత్రమే ఆహారంగా తీసుకుంటున్నాడని అతని తరఫు లాయర్లు ఢిల్లీ కోర్టులో పిటిషన్‌ దాఖలుచేశారు. దీంతో ఈ విషయంలో మీ స్పందన తెలపాలని గతంలో ఇతడిని అరెస్ట్‌ చేసిన జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్‌ఐఏ)ను ఢిల్లీ కోర్టు ప్రత్యేక జడ్జి ప్రశాంత్‌ శర్మ గతవారం ఆదేశించారు. అయితే ఈ విషయమై మాథ్యూ లాయర్లు బుధవారం మాట్లాడారు. 

ఎన్‌ఐఏకు బదులుగా తిహార్‌ జైలు అధికారులు ఈ విషయంలో స్పందన తెలపబోతున్నారని వెల్ల డించారు. ‘‘మాథ్యూ అమెరికా తరహా ఆహారం మాత్రమే తింటాడు. భారతీయ కారాగారాల్లో విచారణ ఖైదీలు, దోషులకు అందించే ఆహారం మహా ఘాటుగా, కారంగా ఉంటుంది. అది ఈయన తినలేడు. మసాలా దట్టించి నూనెలో ముంచి తీసిన, నూనెలో బాగా వేయించిన భారతీయ వంటకాలు మాథ్యూకు పడవు. అందుకే అమెరికన్‌ స్టైల్‌లో ఆహారం అందించాలని న్యాయస్థానాన్ని కోరాం. అతనికి రోజూ సోయామిల్క్‌ను అందుబాటులో ఉంచాలని జడ్జిని అభ్యర్థించాం’’ అని వాళ్లు వెల్లడించారు. ఈ కేసు విచారణను జడ్జి జూలై 21వ తేదీకి వాయిదావేశారు. 
 

#

Tags : 1

Videos

CBIకి సాయికృష్ణ కేసు హైకోర్టు సంచలన తీర్పు

నామినేషన్లు వేయనివ్వరా? పుంగనూరు ఘటనపై లేళ్ల అప్పిరెడ్డి ఆగ్రహం

రణబాలి ..బాహుబలి కంటే బాగుంది.. “గూస్ బంప్స్” తెప్పించేశాడు

మిధున్ రెడ్డిపై దాడి వైఎస్ జగన్ స్టాంగ్ రియాక్షన్

టీమిండియాకు బిగ్ షాక్.. డిసైడర్ మ్యాచ్ కు అర్ష్ దీప్ దూరం?

టీడీపీ నుంచి జనసేనలోకి జంప్.. తుని చైర్మన్ అభ్యర్థిగా మీనాక్షి..!

కూటమి భయపడే ఇలా చేస్తుంది

TDP అరాచకాలకు ఇది పరాకాష్ట ... ఎమోషనల్ అయిన గడికోట శ్రీకాంత్

నేల అడుగున రహస్య యుద్ధం ఏటా 3 కోట్లు బలి! అది ఏంటో తెలుసుకోండి

గెలవాలంటే బుద్దోడిని ఆడించండి: Kris Srikkanth

Photos

+5

నవరాత్రి పూజల్లో హీరోయిన్ సారా అలీ ఖాన్.. (ఫోటోలు)

+5

తిరుమల : మోహినీ అలంకారంలో మలయప్ప స్వామి దర్శనం (ఫొటోలు)

+5

'కరికాల' చిత్రంలో సందీప్ కిషన్‌కి జోడీగా కేథరిన్ (ఫొటోలు)

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)