Breaking News

జీ-7 సమ్మిట్‌: బైడెన్‌తో ప్రధాని మోదీ ప్రత్యేక భేటీ!

Published on Thu, 06/13/2024 - 09:48

ఢిల్లీ: ఇటలీలో రేపు( శుక్రవారం) జరగబోయే జీ-7 దేశాల సమ్మిట్‌లో భాగంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను కలవనున్నట్లు తెలుస్తోంది. ఈ విషయాన్ని అమెరికా నేషనల్‌ సెక్యూరిటీ అడ్వైజర్‌ జేక్ సుల్లివన్ బుధవారం తెలిపారు. జీ-7 దేశాల సమ్మిట్‌కు హాజరయ్యేందుకు ఇటలీ వెళ్తున్న సమయంలో జేక్‌ మీడియాతో మాట్లాడారు. 

‘‘ అమెరికా అధ్యక్షుడు జో బైడెన్‌ను ఇటలీలో ప్రధాని మోదీని చూడాలని ఆశిస్తున్నారు. ఇప్పటికే జీ-7 సమ్మిత్‌కు మోదీ హాజరవుతారని భారత్ అధికారంగా ప్రకటించింది. అయితే మోదీ, బైడెన్ ఇటలీలో కలుసుకునే అవకాశం ఉందని భావిస్తున్నా’’ అని అన్నారు. అదే విధంగా తాము పారిస్‌లో ఉన్న సమయంలో  అధ్యక్షుడు బైడెన్‌ మోదీకి ఫోన్‌ చేసినట్లు తెలిపారు. మోదీ మూడోసారి ప్రధాని అయినందుకు బైడెన్‌ ఫోన్‌లో శుభాకాక్షలు తెలిపారని అన్నారు.

ఇక.. ప్రధాని మోదీ ఇవాళ (గురువారం) ఇటలీ బయల్దేరనున్నారు. మోదీ మూడోసారిగా ప్రధానమంత్రి బాధ్యత్యలు చేపట్టిన అనంతరం ఇటలీ ఆయన మొదటి విదేశి పర్యటన కావటం గమనార్హం. 

జూన్‌ 14న తమ దేశంలో జరగనున్న 50వ జీ-7 సమ్మిట్‌కు హాజరుకావాలని ఇటలీ.. భారత్‌ను ఆహ్వానించిన విషయం తెలిసిందే. ప్రధాని మోదీ ఇటలీ ప్రధాని జార్జియా మెలోనితో భేటీ కానున్నారని విదేశాంగ కార్యదర్శి వినయ్‌ మోహన్‌ క్వాత్రా వెల్లడించారు. అదే విధంగా సమ్మిట్‌ వచ్చే ఇతర దేశాల నేతలతో సైతం ప్రధాని మోదీ భేటీ అయ్యే అవకాశం ఉన్నట్లు క్వాత్రా తెలిపారు. 

Videos

రాబోయే రోజుల్లో పోలీసులు శిక్ష అనుభవించక తప్పదు..

నామినేషన్లు అడ్డుకున్న ఒక్కొక్కడికి చెప్తున్నా.. రోజా ఊర మాస్ వార్నింగ్

Nellore: అధికారుల ఓవరాక్షన్.. ఇచ్చిపడేసిన చంద్రశేఖర్ రెడ్డి

అడ్డుకోవాలని చూసారు పోలీసులకు ఇచ్చిపడేసిన రోజా

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి రేష్మ నామినేషన్ తిరస్కరణ...

నిందితులు అరెస్ట్... టైగర్ పై ఎటాక్ అమెరికా నుంచే ప్లాన్ అమలు...

Tesla Roadster: ఎగిరే కారు.. మస్క్ మరో సంచలనం! ధర తెలిస్తే అవాక్

Penukonda: అధికారుల ఓవర్ యాక్షన్.. ఒక్క ఫోన్ కాల్ తో దుమ్ముదులిపేసిన ఉష శ్రీ చరణ్

అభిషేక్ తో పెళ్లి! శుభ్‌మన్ గిల్, అభిషేక్ శర్మపై షాకింగ్ కామెంట్స్!

శ్రీకాకుళంలో పవన్ కు బిగ్ షాక్ YSRCPలో చేరిన జనసేన యూత్

Photos

+5

రణ్‌బీర్‌ కపూర్‌, సాయిపల్లవి 'రామాయణ' మూవీ HD స్టిల్స్‌

+5

నవరాత్రి స్పెషల్.. ప్రత్యేక పూజల్లో అలియా భట్‌ (ఫొటోలు)

+5

జైలర్‌ 2 హిట్‌.. మిర్నా ఫొటోలు వైరల్‌!

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)