Breaking News

అయోధ్యలో ‍‘ప్రాణ ప్రతిష్ఠ’.. అమెరికాలో సందడి!

Published on Sat, 01/13/2024 - 10:20

అయోధ్యలో ఈనెల 22న జరిగే శ్రీరాముని ప్రాణ ప్రతిష్ఠాపనపై ప్రపంచమంతా ఆసక్తిగా ఎదురు చూస్తోంది. ఈ కార్యక్రమానికి ముందుగానే  అమెరికాలో రామభక్తులు ఇప్పటికే కార్లు, బైక్ ర్యాలీలు చేపట్టారు. ఇంతేకాకుండా జనవరి 22 న అమెరికాలోని న్యూయార్క్ నగరంలోని ప్రముఖ టైమ్స్ స్క్వేర్‌లో ‘ప్రాణ ప్రతిష్ఠ’ కార్యక్రమం ప్రత్యక్ష ప్రసారం కానున్నది. 

అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి మరింత ప్రాధాన్యతనిస్తూ విశ్వహిందూ పరిషత్‌కు చెందిన అమెరికన్ యూనిట్  అక్కడి పది రాష్ట్రాల్లో హోర్డింగ్‌లను ఏర్పాటు చేసింది. ఇప్పటివరకూ మొత్తం 40 హోర్డింగ్‌లను ఏర్పాటు చేసినట్లు వీహెచ్‌పీ ప్రతినిధులు తెలిపారు. ముఖ్యంగా టెక్సాస్, ఇల్లినాయిస్, న్యూయార్క్, న్యూజెర్సీ , జార్జియా రాష్ట్రాల్లో ఈ బోర్టులు ఏర్పాటు చేశారు. అయోధ్యలోని రామాలయ ప్రారంభోత్సవాన్ని పురస్కరించుకుని జనవరి 15 నుండి అరిజోనా, మిస్సోరీలలోని ఆలయాలో ప్రత్యేక వేడుకలు నిర్వహిస్తున్నారు.

న్యూజెర్సీలో పలువురు హిందువులు కారు ర్యాలీలు, మేళాల నిర్వహణలో నిమగ్నమై  ఉన్నారని అమెరికా వీహెచ్‌పీ జాయింట్ సెక్రటరీ తేజా షా తెలిపారు. ఇదిలావుండగా ఆస్ట్రేలియా, యూకే, కెనడా, చికాగోలకు చెందిన  రామభక్తులు భారతదేశానికి వచ్చేందుకు ఇప్పటికే తమ విమాన టిక్కెట్లను బుక్ చేసుకున్నారని సమాచారం.

Videos

అవినాష్ ని గన్ తో కాల్చి చంపాలని చూశారు? YS ప్రమీలమ్మ సంచలన కామెంట్స్

బాబు ఫోటోని చెప్పులతో కొట్టినోడికి..! ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం పై టీడీపీ నేత సంచలన కామెంట్స్

జియో IPO.. లైఫ్ సెటిలా? కొనాలా? వద్దా?

త్రివిక్రమ్ పై పూనమ్ మరో బాంబ్..

నెల్లూరు మేయర్ అభ్యర్థి ఆనం విజయ్ కుమార్ రెడ్డి నామినేషన్..

SECని కలిసిన అనంతరం వైఎస్ జగన్ ప్రెస్ మీట్

భారీ ర్యాలీతో మచిలీపట్నం మేయర్ అభ్యర్ది లంక జ్యోతి నామినేషన్

ఆదర్శ కుటుంబం రిలీజ్ ఎప్పుడంటే...!

ఎల్లకాలం మీదే కాదు.. మా ప్రభుత్వం వచ్చాక..! వెళ్తూ వెళ్తూ జగన్ మాస్ వార్నింగ్

కరుడుగట్టిన తీవ్రవాది..! ఎన్నికల్లో గెలవడానికి ఏకంగా ఈసీలోనే మనిషిని కొనేశాడు..!

Photos

+5

కలర్‌ఫుల్ శారీలో యాంకర్ శ్రీముఖి అందాలు.. (ఫోటోలు)

+5

అనుపమ 'క్రేజీ కళ్యాణం' సక్సెస్ మీట్ (ఫొటోలు)

+5

సిల్క్ శారీలో సింగర్ మంగ్లీ అందాలు.. (ఫోటోలు)

+5

ఆయురారోగ్యాలు ప్రసాదించే శ్రీవారి సూర్యప్రభ వాహనసేవ.. అద్భుత దృశ్యాలు (ఫొటోలు)

+5

బతుకమ్మ వేడుకల్లో సీపీ సజ్జనార్‌ డ్యాన్స్‌ ఫొటోలు చూశారా?

+5

తిరుమల : పుష్ప‌క విమానంలో గోవర్ధనగిరిధారి కృష్ణుడి రూపంలో శ్రీ మ‌ల‌య‌ప్ప (ఫొటోలు)

+5

'రణబాలి' జయమ్మ.. మర్చిపోలేకపోతున్న రష్మిక (ఫొటోలు)

+5

విజయవాడ ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ.. (ఫొటోలు)

+5

‘ఇట్లు అర్జున’ మూవీ ప్రీ-రిలీజ్ వేడుకలో హీరోయిన్‌ అనస్వర రాజన్ (ఫొటోలు)

+5

తిరుమల : హనుమంత వాహనంపై కోదండ రామునిగా శ్రీ మలయప్పస్వామి (ఫొటోలు)