భారతీయ సంస్థల  అధికారుల వీసాలు రద్దు

Published on Fri, 09/19/2025 - 06:11

సాక్షి, న్యూఢిల్లీ: ప్రమాదకరమైన ఫెంటానిల్‌ మాదకద్రవ్యం తయారీలో ఉపయోగించే రసాయనాల అక్రమ రవాణాతో ప్రమేయం ఉన్న భారతీయ కంపెనీల ఉన్నతాధికారులపై అమెరికా ప్రభుత్వం కఠిన చర్యలు చేపట్టింది. పలువురు వ్యాపారవేత్తలు, కార్పొరేట్‌ ఉన్నతాధికారుల వీసాలను రద్దు చేసినట్లు న్యూఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం గురువారం ప్రకటించింది. ట్రంప్‌ పరిపాలన విధానాల్లో భాగంగా అమెరికన్లను ప్రమాదకరమైన సింథటిక్‌ నార్కోటిక్స్‌ నుండి రక్షించే ప్రయత్నంలో ఈ కఠిన నిర్ణయం తీసుకున్నట్లు అమెరికా ఎంబసీ పేర్కొంది. ఈ మేరకు గురువారం ఒక ప్రకటన విడుదలచేసింది. 

కంపెనీల ఎగ్జిక్యూటివ్‌లతోపాటు వారి కుటుంబ సభ్యులను అమెరికాకు ప్రయాణించడానికి అనర్హులుగా ప్రకటించింది. ఇప్పటికే వాళ్లలో అమెరికా వీసా కోసం దరఖాస్తు చేసుకున్న వాళ్ల అభ్యర్థనలను తిరస్కరించామని పేర్కొంది. యూఎస్‌ ఇమిగ్రేషన్‌ అండ్‌ నేషనాలిటీ యాక్ట్‌లోని 221(ఐ), 212(ఎ)(2)(సీ), 214(బీ) సెక్షన్లకు అనుగుణంగా ఈ చర్యలు తీసుకున్నట్లు రాయబార కార్యాలయం స్పష్టం చేసింది. ఫెంటానిల్‌ రసాయనాల స్మగ్లింగ్‌ చేసే కంపెనీలకు చెందిన ఇతర ఎగ్జిక్యూటివ్‌లు భవిష్యత్తులో వీసా కోసం దరఖాస్తు చేస్తే లోతైన పరిశీలన, అధ్యయనం తప్పవని యూఎస్‌ రాయబార కార్యాలయ ప్రతినిధి జోర్గాన్‌ ఆండ్రూస్‌ చెప్పారు. 
 

Videos

YSRCP మున్సిపల్ చైర్మన్ అభ్యర్థుల జాబితా విడుదల

మొదలైన కూటమి కుట్రలు.. YSRCP అభ్యర్థి కొడుకుని తీసుకెళ్లిన పోలీసులు

ఆర్టీసీని చంపేందుకు కుట్ర.. ప్రభుత్వం తీరుపై ఆర్టీసీ జేఏసీ ఫైర్

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

Photos

+5

దుర్గమ్మ దర్శనానికి పోటెత్తిన భక్తులు.. ఇంద్రకీలాద్రిపై భక్తుల రద్దీ (ఫొటోలు)

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)