చట్టాలు ఉల్లంఘిస్తే శిక్షలే!

Published on Thu, 01/01/2026 - 05:05

న్యూఢిల్లీ: వలసదారులకు భారత్‌లోని అమెరికా రాయబార కార్యాలయం మరో హెచ్చరిక జారీ చేసింది. అమెరికాలో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ చట్టాలను ఉల్లంఘిస్తే తీవ్రమైన చర్యలు ఉంటాయని తేల్చిచెప్పింది. క్రిమినల్‌ నేరాల కింద శిక్షలు ఎదుర్కోవాల్సి ఉంటుందని పేర్కొంది. ఈ మేరకు యూఎస్‌ ఎంబసీ తాజాగా సోషల్‌ మీడియాలో పోస్టు చేసింది. 

‘‘చట్టాలను గౌరవించకపోయినా, ఉల్లంఘించినట్లు తేలినా కఠిన చర్యలు తప్పవు. క్రిమినల్‌ నేరాలుగా పరిగణించి శిక్ష విధిస్తారు. అక్రమ వలసలను పూర్తిగా నియంత్రించడమే లక్ష్యంగా డొనాల్డ్‌ ట్రంప్‌ ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోంది. దేశ సరిహద్దులను, పౌరులను రక్షించుకోవాలన్నదే ప్రభుత్వ ధ్యేయం’’అని స్పష్టంచేసింది. నూతన సంవత్సరం సందర్భంగా ఈ పోస్టు చేయడం గమనార్హం. వలసదారులపై ట్రంప్‌ సర్కార్‌ కఠినంగా వ్యవహరిస్తున్న సంగతి తెలిసిందే. 

వీసా నిబంధనలు మార్చేసింది. ప్రధానంగా హెచ్‌–1బీ వీసా ఫీజును లక్ష డాలర్లకు పెంచేసింది. మరోవైపు హెచ్‌–1బీ వీసా ఇంటర్వ్యూలను హఠాత్తుగా వాయిదా వేయడంతో వేలాది మంది భారతీయ వృత్తినిపుణులు స్వదేశానికే పరిమితయ్యారు. ఇంటర్వ్యూ తేదీల కోసం ఎదురుచూస్తున్నారు. వారి సోషల్‌ మీడియా ప్రొఫైల్స్‌ను, పోస్టులను అమెరికా అధికారులు క్షుణ్నంగా పరిశీలిస్తున్నారు.

 ఇలాంటి సమయంలో చట్టాలను ఉల్లంఘించవద్దంటూ అమెరికా ఎంబసీ హెచ్చరించడం చర్చనీయాంశంగా మారింది.  ట్రంప్‌ రెండోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత వలసదారులకు కష్టాలు మొదలయ్యాయి. ట్రంప్‌ ప్రభుత్వం వారిపై కక్షగట్టినట్లు వ్యవహరిస్తోంది. ఈ ఏడాది 6.05 లక్షల మందిని బలవంతంగా బయటకు పంపించింది. అక్రమ వలసదారులను గుర్తించే ప్రక్రియ చురుగ్గా సాగుతోంది. రాబోయే రోజుల్లో ఇంకా చాలామందిని అమెరికా నుంచి వెళ్లగొట్టడం తథ్యమని ట్రంప్‌ ఇప్పటికే సంకేతాలిచ్చారు.   
 

Videos

కాంగ్రెస్ అధిష్టానానికి మంత్రి దామోదర బిగ్ షాక్

అమెరికాలో మరోసారి కాల్పుల కలకలం..చిన్నారులు మృతి

కేంద్ర ఎన్నికల సంఘం ముందుకు 9 సూటి ప్రశ్నలు...?

మున్సిపల్ ఎన్నికల్లో పోటీ చేస్తే చంపేస్తాం.. జేసీ అనుచరుల బెదిరింపులు

ఏలూరు మేయర్ పీఠాన్ని జనసేనకు.. తెలుగు తమ్ముళ్లు ఆగ్రహం.. మొత్తం ఒకేసారి రాజీనామా..

కుక్కకు ఇచ్చిన గౌరవం కూడా జనసేనకు లేదా? వంగవీటి నరేంద్ర కీలక వ్యాఖ్యలు

నాకు తెలిసి పార్టీ మరడం అంటే అధికార పక్షం నుండి ప్రతిపక్షంలోకి వెళ్తారు కానీ..

విశాఖ మేయర్ అభ్యర్థిగా ప్రకటించిన తరువాత వరుదు కళ్యాణి ఫస్ట్ రియాక్షన్

అడ్డంగా నామాలు, తడి బట్టలు.. ధర్మాన్ని, మతాన్ని కాపాడుతా అంటూ.. పవన్ పై వల్లభనేని వంశీ సెటైర్లు

Audio Leak: మీతో గెలవలేం.. దయచేసి పోటీ చేయొద్దు.. YSRCP లీడర్ తో మంత్రి రాంప్రసాద్ రెడ్డి

Photos

+5

హైదరాబాద్‌ : నాంపల్లి పబ్లిక్ గార్డెన్స్‌లో ఘనంగా బతుకమ్మ సంబరాలు (ఫొటోలు)

+5

కళ్యాణ్ నవరాత్రి వేడుకలు...మెరిసిన తారలు (ఫొటోలు)

+5

పుట్టపర్తి ప్రశాంతి నిలయంలో విజయ్ - రష్మిక ప్రత్యేక పూజలు.. (ఫొటోలు)

+5

తిరుమల : సర్వభూపాల వాహనంపై శ్రీ మలయప్ప స్వామి (ఫొటోలు)

+5

చీరకట్టులో నేషనల్‌ క్రష్‌ రష్మిక (ఫొటోలు)

+5

వియ‌త్నాంలో ఎంజాయ్‌ చేస్తున్న మీనాక్షి (ఫొటోలు)

+5

తిరుమల : కల్పవృక్ష వాహనంపై శ్రీ మలయప్పస్వామి కటాక్షం (ఫొటోలు)

+5

సందీప్ కిషన్ కొత్త సినిమా 'కరికాల' సినిమా ప్రారంభోత్సవం (ఫొటోలు)

+5

ఇటలీ ట్రిప్‌లో కిరణ్ అబ్బవరం సతీమణి రహస్య గోరఖ్.. (ఫోటోలు)

+5

ఇంద్రకీలాద్రిపై వైభవంగా దసరా శరన్నవరాత్రి ఉత్సవాలు (ఫొటోలు)