Breaking News

Success Story: నాడు అమ్మతోపాటు గాజులమ్మి.. నేడు ఐఏఎస్‌ అధికారిగా..

Published on Sun, 01/19/2025 - 13:29

బాల్యంలో కటిక దారిద్య్రం అనుభవిస్తూనే, చదువులు కొనసాగించిన కొందరు ఉన్నత స్థానానికి చేరుకున్న ఉదంతాల గురించి మనం అ‍ప్పుడప్పుడు వింటుంటాం. ఇదే కోవలోకి వస్తారు రమేష్ ఘోలాప్. ఈయన సాధించిన విజయం యువతకు స్ఫూర్తినిస్తుందనడంలో సందేహం లేదు.

రమేష్ ఘోలాప్.. ఐఏఎస్ అధికారిగా మారేవరకూ సాగించిన ప్రయాణంలో చదువుపై ఆయన చూపిన అంకితభావం, శ్రద్ధ, కృషి మనకు కనిపిస్తాయి. మహారాష్ట్రలోని షోలాపూర్(Solapur) జిల్లాలోని మహాగావ్ అనే చిన్న గ్రామంలో జన్మించిన రమేష్ చిన్నప్పటి నుంచి అనేక ఇబ్బందులను ఎదుర్కొన్నాడు. రమేష్ తండ్రి గోరఖ్ ఘోలాప్ ఒక చిన్న సైకిల్ మరమ్మతుల దుకాణం నడిపేవాడు. మద్యం అలవాటు కారణంగా అతని తండ్రి ఆరోగ్యం క్షీణిస్తూ వచ్చింది. ఇంట్లో పరిస్థితి అంతకంతకూ దిగజారింది. ఒకరోజు రమేష్‌ తండ్రి దుకాణం మూసివేశాడు.

దీంతో రమేష్ తల్లి విమల్ ఘోలాప్ కుటుంబాన్ని పోషించేందుకు సమీప గ్రామాల్లో గాజులు అమ్మడం ప్రారంభించింది. ఆ సమయంలో రమేష్‌ తన తల్లికి సహాయం చేస్తూ వచ్చాడు. 2005లో రమేష్‌ తండ్రి మరణించాడు. కుటుంబసభ్యులు పొరుగింటివారి సాయంలో  అంత్యక్రియలు(Funeral) నిర్వహించారు. ఈ ఘటన రమేష్‌ను అమితంగా ఆలోచింపజేసింది. పేదరికం నుండి బయటపడటానికి ఏకైక మార్గం విద్య అని రమేష్‌ గ్రహించాడు. చదువుపై దృష్టి సారించిన రమేష్ ఓపెన్ యూనివర్సిటీ నుండి ఆర్ట్స్‌లో డిగ్రీ పూర్తి చేశాడు. 2009 లో ఉపాధ్యాయుడైన తర్వాత కూడా, తన ఆశయంపై దృష్టి సారిస్తూ ముందుకుసాగాడు.

యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష (సీఎస్ఈ) కి సిద్ధం కావాలని నిర్ణయించుకుని, ప్రిపరేషన్‌ కోసం రమేష్ పూణేకు పయనమయ్యాడు. ఆ సమయంలో అతని తల్లి  అండగా నిలిచింది. 2010లో రమేష్ తన మొదటి ప్రయత్నంలో యుపీఎస్సీ సివిల్ సర్వీసెస్ పరీక్ష విఫలమయ్యాడు. పోలియో బాధితుడైన రమేష్‌ 2012లో వికలాంగుల కోటా(Disabled quota) కింద యూపీఎస్సీ పరీక్షలో ఆల్ ఇండియా ర్యాంక్ (ఏఐఆర్‌)287తో ఉత్తీర్ణుడయ్యాడు. ఐఎఎస్‌ అధికారి కావాలన్న తన కలను నెరవేర్చుకున్నాడు. ప్రస్తుతం ఐఏఎస్ రమేష్ ఘోలాప్ జార్ఖండ్ ఇంధన శాఖలో జాయింట్ సెక్రటరీగా పనిచేస్తున్నారు. ఆయన కథ కోట్లాది మంది యువతకు ప్రేరణ కల్పిస్తుందనడంలో సందేహం లేదు.

ఇది కూడా చదవండి: తమకు తామే పిండం పెట్టుకుని.. నాగ సాధువులుగా మారిన 1,500 మంది సన్యానులు

Videos

ఒంటరైన గంభీర్ రోహిత్ కోసం రెండుగా చీలిన బీసీసీఐ

DSCపై కొండారెడ్డి బురుజు దగ్గర ప్రభాకర్ తో కలిసి చర్చకి సిద్ధమా లోకేష్ ?

సంక్షోభంలో ఫోక్స్ వ్యాగన్.. మరో 50 వేల ఉద్యోగాలకు కోత

ట్రంప్ కు దిమ్మతిరిగే షాక్.. బర్త్ రైట్ సిటిజన్ షిప్ ఆర్డర్ కు కోర్టు బ్రేక్!

Konda Surekha: నన్ను తీయడం వల్ల వాళ్లకే నష్టం

ఇంకా ఎన్నెన్ని బయటపడతాయో? కొండా బర్తరఫ్ పై రామచంద్రరావు రియాక్షన్

మళ్లీ ఢిల్లీకి రేవంత్.. మంత్రుల్లో కొత్త టెన్షన్!

10 ఏళ్లలో 82% పనులు..!వెలిగొండపై YSR-జగన్ కు ఘనత

Pedakakani Temple: గుడిలోకి వెళ్లకుండా ఆపారు ఇచ్చిపడేసిన అశోక్ బాబు

బాలిక ఎక్కడుంది..? 80 రోజులైనా ఆచూకీ లేదు పోలీసుల తీరుపై హైకోర్టు ఫైర్

Photos

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు