Breaking News

ప్రిలిమినరీ తర్వాత తాత్కాలిక జవాబు కీ 

Published on Sun, 10/05/2025 - 06:23

న్యూఢిల్లీ: ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని నిర్ణయించినట్లు యూనియన్‌ పబ్లిక్‌ సరీ్వస్‌ కమిషన్‌.. సుప్రీంకోర్టుకు తెలియజేసింది. గత నెలలో అత్యున్నత న్యాయస్థానంలో దాఖలు చేసిన అఫిడవిట్‌లో.. తుది ఫలితాల ప్రకటన తర్వాతే తుది జవాబు కీని ప్రచురిస్తామని కమిషన్‌ తెలిపింది. ఈ అఫిడవిట్‌ను సివిల్‌ సరీ్వసెస్‌ పరీక్షకు సంబంధించి.. పెండింగ్‌లో ఉన్న పిటిషన్‌లో దాఖలు చేశారు. ఈ కేసు విచారణలో ఉన్న సమయంలో, కోర్టు నియమించిన అమికస్‌ క్యూరీ సూచనతో సహా వివిధ అంశాలపై తాము చర్చించామని యూపీఎస్సీ పేర్కొంది.

 ‘సమగ్ర చర్చల అనంతరం.. బాగా ఆలోచించాక ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించిన తర్వాత తాత్కాలిక జవాబు కీని ప్రచురించాలని కమిషన్‌ నిర్ణయించింది.. అని అడ్వకేట్‌ వర్ధమాన్‌ కౌశిక్‌ ద్వారా దాఖలు చేసిన అఫిడవిట్‌లో పేర్కొంది. పరీక్షకు హాజరైన అభ్యర్థుల నుంచి అభ్యంతరాలు లేదా ప్రాతినిధ్యాలు కోరతామని అందులో వివరించింది. అభ్యర్థులు తెలిపే ప్రతి అభ్యంతరం లేదా ప్రాతినిధ్యానికి మూడు ప్రామాణిక ఆధారాలను జత చేయాలని, అలా జత చేయని అభ్యంతరాలను ప్రారంభ దశలోనే తిరస్కరించాలని అఫిడవిట్‌లో తెలిపారు. ‘అయితే, సమర్పించిన ఆధారాలు ప్రామాణికమైనవా? కాదా? అనేది కమిషనే నిర్ణయిస్తుంది’.. అని కూడా అందులో స్పష్టం చేశారు.  
 

Videos

DSCలో జరిగిన అక్రమాలు బట్టబయలు

కొండా సురేఖ చేసిన తప్పేంటి..? అసలు కారణం ఎవరు ఢిల్లీలో జరిగింది ఇదేనా..?

నాలాంటోడు నీకు ఇంకా తగలలేదు ఏమో... టీడీపీ ఎమ్మెల్యే Vs ధర్మాన కృష్ణ చైతన్య

లోకేష్... కర్మ ఎవ్వడిని వదిలిపెట్టదు నువ్వు చేసే పాపాలు అన్ని బయటికి తీస్తాం

నేపాల్ లో మృత్యుంజయులు 9రోజుల తర్వాత..

పోలీసుల వివక్షను ప్రశ్నించిన కృపా లక్ష్మీ..!

ఇస్రో ఖాతాలో మరో భారీ విజయం

4 సార్లు చేతులు తిప్పి.. 4 డైలాగులు కొడితే మంత్రివి కాలేవు... బాబు కి మాస్ కౌంటర్

పాడి కౌశిక్ రెడ్డికి ఎథిక్స్ కమిటీ నోటీసులు..!

41 ఏళ్లకు జూడో సర్టిఫికెట్.. లోకేష్ స్కాం బట్టబయలు..

Photos

+5

కృష్ణుడు వచ్చేశాడోచ్.. క్యూట్ డ్రెస్సుల్లో సందడి చేసిన సినీ ప్రముఖుల పిల్లలు! (ఫొటోలు)

+5

చిన్ని కృష్ణుడిగా కిరణ్ అబ్బవరం కొడుకు.. క్యూట్‌నెస్‌కు నెటిజన్లు ఫిదా!

+5

సిప్లిగంజ్‌కు రాఖీ కట్టిన సింగర్ సమీరా.. ఫోటోలు

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)