Breaking News

ఢిల్లీ రావూస్ కోచింగ్ సెంటర్ విషాదం : ఎస్‌యూవీ డ్రైవర్‌కు బెయిల్‌

Published on Thu, 08/01/2024 - 19:26

ఢిల్లీ : ఢిల్లీ రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌లో విద్యార్ధుల మరణాల కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. ఈ కేసులో ఎస్‌యూవీ డ్రైవర్‌ మను కతురియాకు ఢిల్లీలోని తీస్‌ హజారీ కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది.

జులై 27న ఢిల్లీలో రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌ బేస్‌మెంట్‌లోకి నీరు చేరి ముగ్గురు సివిల్స్‌ అభ్యర్థులు మరణించిన ఘటన దేశవ్యాప్తంగా సంచలనంగా మారింది. అయితే ముగ్గురు విద్యార్థుల మరణానికి పరోక్షంగా ఎస్‌యూవీ డ్రైవర్‌ మను కతురియా కారణమంటూ ఢిల్లీ పోలీసులు ఆయన్ని అరెస్ట్‌ చేశారు.

తన అరెస్ట్‌ని సవాల్‌ చేస్తూ కతురియా ఢిల్లీ జిల్లా తీస్ హజారీ కోర్టును ఆశ్రయించారు. గురువారం విచారణ చేపట్టిన కోర్టు రూ.50వేల పూచికత్తుతో షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. 

జులై 27న సాయంత్రం ఢిల్లీలో భారీ వర్షం కురిసింది. దాంతో వరదలు పోటెత్తాయి. ఈ క్రమంలో ఓల్డ్‌ రాజేందర్‌ నగర్‌లోని రావూస్‌ సివిల్స్‌ కోచింగ్‌ సెంటర్‌లో సెల్లార్‌లోకి భారీగా వరద నీరు చేరింది. అదే సమయంలో రావుస్‌ కోచింగ్‌ సెంటర్‌ ఎదురుగా ఉన్న రోడ్డుపై మను కతురియా తన ఎస్‌యూవీ వాహనాన్ని వేగంగా డ్రైవింగ్‌ చేయడంతో వరద నీరు సెల్లార్‌లోకి చేరుకుంది. దీంతో వరదలో చిక్కుకుని సెల్లార్‌లోని లైబ్రరీలో చదువుకుంటున్న ముగ్గురు విద్యార్ధులు మరణించారు. ఈ దుర్ఘటనలో విద్యార్ధుల మరణానికి  మను కతురియా కారకుడేనంటూ ఢిల్లీ పోలీసులు అరెస్ట్‌ చేశారు. తన అరెస్ట్‌ను కతురియా సవాల్‌ చేస్తూ కోర్టును ఆశ్రయించగా.. విచారణ చేపట్టిన కోర్టు బెయిల్‌ మంజూరు చేసింది. 

Videos

నేను రాజీనామా చేయను ఎమ్మెల్యేగా విధులు నిర్వహిస్తా

విజయ్ సాయి రెడ్డి, మాగుంట కామెంట్స్ పై డాక్టర్ రాధా మాధవి సీరియస్

కొండా విషయంలో జరిగింది ఇదే పిన్ టు పిన్ మీకోసం

రేవంత్ బ్లాక్ మెయిల్ రాజకీయం చేస్తున్నాడు... బాంబు పేల్చిన కొండా సురేఖ

YSRకు రేవంత్ కు తేడా ఇదే...!

మమ్మల్ని నమ్మించి మోసం చేశావ్ బాబుపై బొప్పరాజు సంచలన కామెంట్స్

తగ్గదేలే...మీసం మెలేసిన కొండా మురళి

ఫుల్ స్పీడ్ లో రవితేజ.. Next ప్రాజెక్ట్ ఎవరితో అంటే!

LIVE : కొండా సురేఖ సంచలన ప్రెస్ మీట్

భయం పట్టుకుంది అందుకే పోలవరం గురించి మాట్లాడటం మానేశా

Photos

+5

పచ్చని కొండల్లో హీరోయిన్ రహస్య గోరఖ్ చిల్.. ఫోటోలు

+5

బంగారంలా మెరిసిపోతున్న అనుపమ పరమేశ్వరన్.. ఫోటోలు

+5

‘ఇరుముడి’ మూవీ రూ.200 కోట్ల కలెక్షన్స్ సెలబ్రేషన్స్ (ఫొటోలు)

+5

దేవతను తలపించే లుక్‌లో నికితా పోర్వాల్‌ (ఫోటోలు)

+5

నీలం రంగు డ్రెస్ లో హీరోయిన్ రాశీ సింగ్ కిర్రాక్ ఫోటోలు

+5

ఢిల్లీలో ఘనంగా వైఎస్సార్‌ అవార్డుల ప్రదానోత్సవం (ఫొటోలు)

+5

‘రంభ ఊర్వశి మేనక’ సినిమా ప్రీ-రిలీజ్ ఈవెంట్‌ (ఫొటోలు)

+5

కాశీలో పుట్టినరోజుని సెలబ్రేట్ చేసుకున్న హీరోయిన్ మానస (ఫొటోలు)

+5

అల్లు స్నేహ ఆగస్టు మెమొరీస్ (ఫొటోలు

+5

మై లిటిల్ ప్యారడైజ్‌.. కొడుకు అర్జున్‌తో నాని క్యూట్ మూమెంట్స్‌ (ఫోటోలు)