Breaking News

ఉరితీసే దాకా  విశ్రమించం: బాధితురాలు

Published on Tue, 12/30/2025 - 05:44

ఉన్నావ్‌:  ఢిల్లీ హైకోర్టు ఉత్తర్వుపై సుప్రీంకోర్టు స్టే విధించడంతో ఉన్నావ్‌ కేసు బాధితురాలు సోమవారం సంతృప్తి వ్యక్తంచేశారు. సెంగార్‌ను ఉరితీసే దాకా విశ్రమించే ప్రసక్తే లేదని బాధితురాలు తేల్చిచెప్పారు. సుప్రీంకోర్టు నుంచి న్యాయం జరిగినట్లు భావిస్తున్నానని చెప్పారు. తనపై అత్యాచారం జరిగినప్పటి నుంచి న్యాయం కోసం గొంతు వినిపిస్తున్నానని పేర్కొన్నారు. ఏ కోర్టుపైనా తాను ఆరోపణలు చేయడం లేదని, అన్ని కోర్టులపై సంపూర్ణ విశ్వాసం ఉందని తెలిపారు. న్యాయం జరిగేదాకా పోరాడుతూనే ఉంటానని స్పష్టంచేశారు. సెంగార్‌ను ఉరి తీస్తేనే పూర్తిగా న్యాయం జరిగినట్లు అవుతుందన్నారు.

 తమకు ఇప్పటికీ బెదిరింపులు వస్తున్నాయని ఆందోళన వ్యక్తంచేశారు. న్యాయ వ్యవస్థపై నమ్మకం బలపడిందని బాధితురాలి సోదరి చెప్పారు. సెంగార్‌ ఒక క్రూర జంతువు అని మండిపడ్డారు. తొలుత తన సోదరిని, తర్వాత తమ కుటుంబాన్ని నాశనం చేశాడని ధ్వజమెత్తారు. అతడికి ఇచ్చిన బెయిల్‌ను సుప్రీంకోర్టు నిలిపివేయడం సంతోషం కలిగిస్తోందన్నారు. ఈ కేసులో పోరాటం ఆపబోమని తేల్చిచెప్పారు. మరోవైపు బాధితురాలి తల్లి సుప్రీంకోర్టుకు కృతజ్ఞతలు తెలియజేశారు. తన బిడ్డపై అత్యాచారం చేసి, తన భర్తను చంపిన నేరగాడికి మరణ శిక్ష పడాల్సిందేనని అన్నారు. సుప్రీంకోర్టు ధర్మాసనం ఆదేశాలపై సామాజిక కార్యకర్త యోగితా స్పందించారు. ఇది కేవలం ఉన్నావ్‌ బాధితురాలి పోరాటం కాదని.. మహిళలందరి పోరాటమని ఉద్ఘాటించారు. ఇది చాలా భిన్నమైన కేసు కాబట్టి హైకోర్టు ఉత్తర్వులపై స్టే విధిస్తున్నట్లు సుప్రీంకోర్టు చెప్పిందని అన్నారు.  

Videos

కాలేజీలో బిగ్ బాస్ ఓటింగ్.. కేంద్రం సీరియస్ వార్నింగ్...

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)