Breaking News

స్మార్ట్‌ఫోన్ కొనుగోలు చేస్తే.. 2 కేజీల టమాటాలు ఫ్రీ..

Published on Sun, 07/09/2023 - 09:06

భోపాల్‌: దేశంలో టమాటా ధరలు మిన్నంటాయి. సామాన్యుడు కొనలేనంత భారంగా మారాయి. కానీ మధ్యప్రదేశ్‌లో ఓ సెల్‌ఫోన్‌ షాప్‌ ఓనర్‌ ఈ అవకాశాన్ని సరైన విధంగా వాడుకుంటున్నాడు. ఇటు ప్రజలకు మేలు చేస్తున్నట్లు.. అటు తన బిజినెస్‌ను అభివృద్ధి చేసుకుంటున్నాడు. అదేంటంటే.. తన వద్ద స‍్మార్ట్‌ఫోన్‌ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలను ఉచితంగా ఇస్తాననే ఆఫర్ పెట్టాడు. దీంతో మొబైల్ కొనుగోలుదారులు ఇటువైపే మొగ్గుచూపుతున్నారు. 

మధ్యప్రదేశ్‌లోని అశోక్ నగర్‌లో ఆయన పేరు అభిషేక్.. తన పేరు మీదుగానే ఓ ఎలక్ట్రానిక్ దుకాణాన్ని నడిపిస్తున్నాడు. కొంత కాలంగా గిరాకీ సరిగా లేదని గ్రహించిన అభిషేక్‌.. ఎలాగైన వినియోగదారులను ఆకర్షించాలని అనుకున్నాడు. ఇప్పడే టమాటా ధరలు పెరిగిపోగా.. దీన్నే తన వ్యాపార సాధనంగా మార్చుకున్నాడు. కేజీ రూ.160-180 వరకు మార్కెట్‌లో ధర పలుకుతున్న నేపథ్యంలో ఏదైనా స్మార్ట్ ఫోన్ కొనుగోలు చేస్తే రెండు కేజీల టమాటాలు ఫ‍్రీగా ఇస్తానని ఆఫర్ పెట్టాడు. ఒక సెల్‌ఫోన్‌ మీద 300 పైనే డిస్కౌంట్ వచ్చిన అభిప్రాయం వినియోగదారునికీ కలుగుతుందని చెబుతున్నాడు.

దీంతో ఇన్నాళ్లు దీవాలా తీసిన వ్యాపారం ఒక్కసారిగా ఊపందుకుందని అభిషేక్‌ అంటున్నాడు. సెల్‌ ఫోన్ కొనుగోలుదారులు అభిషేక్ షాప్‌లో కొనుగోలు చేస్తున్నారు. టమాటా పేరుతో తన షాప్ అడ్వర్టైజ్‌మెంట్‌ కూడా ఉచితంగా అవుతుందని అభిషేక్ చెబుతున్నాడు. అటు.. దేశంలో టమాటా రేట్లపై ప్రతిపక్షాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. 

ఇదీ చదవండి: టేకాఫ్‌ కష్టమని 19 మంది ప్రయాణికులను దింపేసిన విమాన సిబ్బంది

Videos

నామినేషన్లు అడ్డుకోవడంపై... అనిల్ చంద్ర పునేఠా స్ట్రాంగ్ రియాక్షన్

IPL 2027 వేలం డేట్ ఫిక్స్ ? ఎక్కడంటే?

టైగర్ షాఫ్ ను కాల్చింది నేనే సంచలన ఆడియో రిలీజ్

కుప్పంలో హైటెన్షన్.. విజయ్ కుమార్ కిడ్నాప్, భరత్ ఇంటిపై దాడి

TDP గూండాలతో కలిసిన పోలీసులు తిరగబడ్డ YSRCP నేతలు

గవర్నర్ కు చెప్పినా నో యూజ్ సుప్రీంకోర్టుకు YSRCP!

రోహిత్ ఆ లాజిక్ ని DECODE చేస్తాడా.? రెచ్చిపోతున్న త్రిగుణ్

AP: MPTC, ZPTC ఎన్నికల నోటిఫికేషన్ రిలీజ్..

ఎందుకు బ్రో ఇంత భయం.. సిగ్గులేకుండా రౌడీలను పెట్టి దాడులు

ప్రచారం చేయకుండానే అత్యధిక మెజారిటీతో గెలుస్తాం YS ప్రమీలమ్మ ఛాలెంజ్

Photos

+5

జిగేలుమంటున్న ప్రియాంక.. ఎల్లోరా శిల్పం కూడా తక్కువే! (ఫొటోలు)

+5

నవరాత్రి వేడుకల్లో కుందనపు బొమ్మలా మాళవిక (ఫొటోలు)

+5

కిరణ్ అబ్బవరం సినిమాతో కన్నడ బ్యూటీ టాలీవుడ్ ఎంట్రీ.. ఎవరీమె?

+5

బతుకమ్మ పండగ.. అందంగా హీరోయిన్ అనన్య (ఫొటోలు)

+5

తిరుమల : స్వర్ణరథంపై దేవదేవుడు శ్రీ వేంకటాద్రీశుడు దివ్య దర్శనం (ఫోటోలు)

+5

నవరాత్రి స్పెషల్.. టాలీవుడ్ బ్యూటీస్ వేరే లెవల్ గ్లామర్ (ఫొటోలు)

+5

విశ్వక్‌ సేన్‌ ‘కల్ట్‌’ మూవీ ట్రైలర్‌ లాంచ్‌ ఈవెంట్‌ (ఫోటోలు)

+5

మైసూరు దసరా మహోత్సవం.. జంబూసవారీ ఏర్పాట్లు (ఫోటోలు)

+5

తిరుమల : చంద్రప్రభ వాహనంపై నర్తన కృష్ణుడి అలంకారంలో శ్రీ మలయప్పస్వామి (ఫోటోలు)

+5

హైదరాబాద్ : సద్దుల బతుకమ్మ వేడుకల్లో బతుకమ్మ ఆడిన రష్మిక (ఫోటోలు)